Baby Elephant: దాహంతో నీరు తాగేందుకు వచ్చి వాటర్ ట్యాంక్‌లో పడ్డ గున్న ఏనుగు.. పాపం
అసలే ఎండాకాలం.. ఎంత దాహంతో ఉన్నాయో.. దీంతో ఆ ఏనుగులు గుంపు నీళ్లు తాగేందుకు ఓ ప్రైవేట్ ఎస్టేట్ వద్దకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఓ గున్న ఏనుగు అక్కడే ఉన్న వాటర్ ట్యాంక్‌లో పడిపోయి.. ప్రాణాలు విడిచింది. తమిళనాడు రాష్ట్రంలో జరిగింది ఈ ఘటన.

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో విషాదకర ఘటన జరిగింది. వాటర్ ట్యాంక్‌లో పడి గున్న ఏనుగు మృతి చెందింది. ఓ ప్రైవేట్ ఎస్టేట్‌లో నీళ్లు తాగడానికి ఏనుగుల గుంపు వచ్చింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ట్యాంక్‌లో పడిపోయింది పిల్ల ఏనుగు. దీంతో ఏం చేయాలో పాలుపోక అలానే ఉండిపోయాయి మిగతా ఏనుగులు. పిల్ల ఏనుగు బతికే ఉందేమో అని అవన్నీ చాలాసేపు అక్కడే ఉండిపోయాయి. ఏం చేయాలో పాలుపోక ఆ ఏనుగులు పడిన బాధ స్థానికులు తీసిన వీడియోల్లో రికార్డయ్యింది. కాగా ఘటనపై అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు స్థానికులు. వారు అక్కడికి చేరుకుని ఏనుగు మృతదేహాన్ని బయటకు తీసి.. అంత్యక్రియలు చేశారు.
ఘటనపై రాష్ట్ర అటవీ శాఖ విచారణ చేపట్టింది. నటుడు సత్యరాజ్ సోదరికి చెందిన ప్రైవేట్ ఎస్టేట్‌లో ఈ ఘటన జరిగింది. కాగా గుంపులో ఏదైనా ఏనుగు చనిపోతే.. దాన్ని తాకుతూ.. మృతదేహంపై కాళ్లు పెట్టి.. మిగతా ఏనుగులు నివాళి అర్పిస్తాయి. కానీ పాపం వాటికి ఇప్పుడు ఆ అవకాశం కూడా లభించలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
