
అయోధ్య, జనవరి 22: ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక రాజధాని అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాన మంత్రి దేశ ప్రజలందరి తరఫున ఈ పుణ్య కార్యాన్ని నిర్వహించారు. ఈ ప్రతిష్ఠ మహోత్సవానికి మూలం మూల విరాఠుడి విగ్రహం. దీనిని రూపొందించింది అరుణ్ యోగిరాజ్. ఈయన మైసూరుకు చెందిన గొప్ప శిల్పకళాకారులు. ఈ విగ్రహం ప్రతిష్ఠించిన తరువాత ఆయన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ భూమి మీద తనకంటే అదృష్టవంతులు ఎవరూ ఉండరని ఆయన పేర్కొన్నారు. రామ్ లల్లా విగ్రహా రూపాన్ని తయారు చేయడం తనకు దక్కిన మహద్భాగ్యంగా చెప్పారు అరుణ్ యోగిరాజ్. ఈ పుణ్య యజ్ఞంలో తనకు ప్రాధాన్యం ఇవ్వడంపై అమితానందాన్ని వ్యక్తం చేశారు.
‘ఈ క్షణం ఈ భూమ్మీద అత్యంత అదృష్టవంతుడిని నేనే అనే భావన కలుగుతోంది. నా పూర్వీకులు, కుటుంబ సభ్యులు, రామ్‌లల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ నాతో ఉంటాయి. ఒక్కోసారి ఇదంతా కలలా అనిపిస్తుంది’ అంటూ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ముగ్గురు శిల్పులు వేర్వేరు శిలలతో రాముడి శిల్పాలను చెక్కగా అందులో ఒక్క విగ్రహాన్ని గర్భగుడికోసం ఎంపిక చేశారు. అది యోగిరాజ్ చెక్కిన శిల్పం కావడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నారు. రామ్‌లల్లా అని భక్తులు పిలుచుకునే ఈ బాల రాముడి విగ్రహాన్ని 51 అంగుళాల ఎత్తుతో అంటే 4.25 అడుగుల్లో ఆకర్షణీయంగా రూపొందించానన్నారు. ఈ మూల విరాఠ్ను అత్యంత శ్రేష్ఠమైన, ఖరీదైన కృష్ణశిలతో తీర్చిదిద్దినట్లు వివరించారు. శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు రాముడిపై ప్రసరించే విధంగా ఈ విగ్రహం ఎత్తును నిర్ణయించారని వెల్లడించారు. ఈ విగ్రహం రూపొందించడంతో తన జన్మ సార్థకతను సంతరించుకుందని భావోద్వేగానికి గురయ్యారు.
#WATCH | Ayodhya, Uttar Pradesh: Ram Lalla idol sculptor, Arun Yogiraj says "I feel I am the luckiest person on the earth now. The blessing of my ancestors, family members and Lord Ram Lalla has always been with me. Sometimes I feel like I am in a dream world…" pic.twitter.com/Eyzljgb7zN
— ANI (@ANI) January 22, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..