సుందర నగరంలో మంచు విధ్వంసం.. ఆరుగురు మృతి.. హిమపాతంలో ఇరుక్కుపోయిన 350 మంది..!

|

Apr 04, 2023 | 4:53 PM

22 మంది పర్యాటకులను వెంటనే రక్షించారు. జరిగిన ప్రమాదంతో రోడ్డు స్తంభించింది. రోడ్డుపై ఉన్న మంచును తొలగించిన తర్వాత 350 మంది పర్యాటకులు, మంచులో చిక్కుకున్న 80 వాహనాలను సురక్షితంగా బయటకు తీశారు.

సుందర నగరంలో మంచు విధ్వంసం.. ఆరుగురు మృతి.. హిమపాతంలో ఇరుక్కుపోయిన 350 మంది..!
Sikkim Avalanche
Follow us on

సిక్కింలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గ్యాంగ్‌టక్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం గ్యాంగ్‌టక్‌లో హిమపాతం భారీ విధ్వంసం సృష్టించింది. హిమపాతం కారణంగా ఆరుగురు చనిపోయారు. 11 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలం నుంచి దాదాపు 350 మందిని సురక్షితంగా తరలించారు. నలుగురు మృతుల్లో ఒక మహిళ, ఒక చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో హిమపాతం సంభవించింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, గ్యాంగ్‌టక్, నాథులా పాస్‌లను కలిపే జవహర్‌లాల్ నెహ్రూ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదం పరిపాలన పోలీసు వ్యవస్థను కుదిపేసింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌లోని ఆసుపత్రికి తరలించారు. నాథులా ప్రాంతంలో హిమపాతం బారిన పడిన 22 మంది పర్యాటకులను వెంటనే రక్షించారు. జరిగిన ప్రమాదంతో రోడ్డు స్తంభించింది. రోడ్డుపై ఉన్న మంచును తొలగించిన తర్వాత 350 మంది పర్యాటకులు, మంచులో చిక్కుకున్న 80 వాహనాలను సురక్షితంగా బయటకు తీశారు.

ప్రమాదం గురించి అడిగినప్పుడు, సంఘటనా స్థలంలో రెస్క్యూ, తరలింపు కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నాథులా చైనా సరిహద్దులో ఉంది. దాని సహజ అందం కారణంగా ప్రధాన పర్యాటక కేంద్రంగా ఉంది. ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..