Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలలకు కోవిద్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల స్కూళ్లను తెరవవచ్చు… ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా

పిల్లలకు కోవిద్ వ్యాక్సిన్ అందుబాటు లోకి రావడం అత్యంత ప్రధాన విషయమని, వారికి మళ్ళీ స్కూళ్ళు తెరిచే అవకాశం ఉంటుందని ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా అన్నారు.

పిల్లలలకు కోవిద్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల స్కూళ్లను తెరవవచ్చు... ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా
Randeep Guleria
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 27, 2021 | 11:35 PM

పిల్లలకు కోవిద్ వ్యాక్సిన్ అందుబాటు లోకి రావడం అత్యంత ప్రధాన విషయమని, వారికి మళ్ళీ స్కూళ్ళు తెరిచే అవకాశం ఉంటుందని ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా అన్నారు. 2 నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్సువారికి భారత్ బయో టెక్ వారి కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్ రెండు, మూడో ట్రయల్స్ నిర్వహణ సెప్టెంబరు నాటికీ పూర్తి కావచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పటికి బహుశా దేశంలో వీరికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని భావిస్తున్నామని ఆయన చెప్పారు. అయితే డ్రగ్స్ రెగ్యులేటరీ ఆమోదం కూడా ఉండాలన్నారు. ఆలోగా ఫైజర్ టీకామందుకు ఆమోదం లభించిన పక్షంలో అది కూడా బాలలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఏడాదిన్నర కాలంగా విద్యా సంస్థలు మూత పడడం వల్ల విద్యార్థులు చదువుల పరంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు- జైడస్ క్యాడిలా టీకామందు కూడా అత్యవసర వినియోగం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.. జైకొవ్-డీ గా వ్యవహరిస్తున్న దీన్ని పెద్దలకు కూడా ఇవ్వవచ్చునని ఆయన తెలిపారు. అంటే ఈ వ్యాక్సిన్ కూడా సెప్టెంబరు నాటికీ అందుబాటులోకి వస్తే అంతకన్నా మంచి విషయం ఏముంటుందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

బాలల్లో కోవిద్ ఇన్ఫెక్షన్లను రివ్యూ చేసేందుకు కేంద్రం తాజాగా జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం అప్పుడే థర్డ్ వేవ్ ముప్పును ఎదుర్కోవడానికి తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారించింది. తగిన సిఫారసులను రూపొందిస్తోంది. మరోవైపు జైనస్ క్యాడిలా టీకామందును సైతం బాలలపై టెస్టు చేస్తున్నట్టు డాక్టర్ వి.కె. పాల్ తెలిపారు. ఏమైనా థర్డ్ వేవ్ రాకముందే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Shocking Video: కారు నిండా డబ్బులే.. డోర్ ఓపెన్ చేయడం ఆలస్యం కుప్పలు కుప్పలుగా.. షాకింగ్ వీడియో మీకోసం..

జన్మ భూమికి వందనం….. ఇది నా మాతృభూమి…. పులకించిపోయిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్