Atal Bihari Vajpayee: అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ..

అటల్ బిహారి వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని విజయ్‌ఘాట్‌ 'సదైవ్ అటల్' స్మారక చిహ్నం వద్ద రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి ధన్‌కర్‌, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు బీజేపీ ప్రముఖులు వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

Atal Bihari Vajpayee: అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ..
Atal Bihari Vajpayee birth anniversary

Updated on: Dec 25, 2023 | 11:43 AM

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన తన జీవితాంతం దేశాభివృద్ధి కోసం కృషి చేశారని పేర్కొన్నారు. అటల్ బిహారి వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని విజయ్‌ఘాట్‌ ‘సదైవ్ అటల్’ స్మారక చిహ్నం వద్ద రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి ధన్‌కర్‌, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు బీజేపీ ప్రముఖులు వాజ్‌పేయికి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

అనంతరం ప్రముఖులందరూ సంగీత విభావరిలో పాల్గొన్నారు. కాగా.. మాజీ ప్రధాని వాజ్‌పేయి పుట్టిన రోజును సుపరిపాలన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.


అంతకుముందు రోజు, ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ ఫాం X లో ఇలా వ్రాశారు.. “మాజీ ప్రధాని గౌరవనీయులైన అటల్ బిహారీ వాజ్‌పేయి గారి జయంతి సందర్భంగా దేశంలోని కుటుంబ సభ్యులందరి తరపున నేను నివాళులర్పిస్తున్నాను. అతను తన జీవితాంతం దేశ నిర్మాణాన్ని వేగవంతం చేయడంలో నిమగ్నమై ఉన్నారు.. 2047లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి దేశానికి అంకితభావం, సేవా స్ఫూర్తిని ‘అమృత్‌కాల్‌’ సమయంలో స్ఫూర్తిగా నిలబెడుతుంది..’’ అంటూ ప్రధాని మోదీ X లో అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..