Corona Virus: దేశంలో క్రమంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్రలో రోజువారీ కేసులు భారీగా నమోదుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24గంటల్లో 4,355 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదు కాగా… ముగ్గురు మరణించారు. దాదాపు నాలుగు నెలల్లో ఇదే అత్యధిక రోజువారీ కేసుల సంఖ్య అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అందించిన డేటా సూచించింది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 20,000 మార్కును అధిగమించింది. మహారాష్ట్రలో వరసగా రెండో రోజు 4,000 కేసులు నమోదయ్యాయి. బుధవారం, రాష్ట్రంలో 4,024 కేసులు నమోదయ్యాయి.
ఓమిక్రాన్ సబ్-వేరియంట్ 2 కేసులు:
కొత్తగా రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NEERI) నివేదిక ప్రకారం.. ఇద్దరు రోగులు నాగ్‌పూర్‌కు చెందినవారిగా తెలుస్తోంది. బాధితుల్లో ఒకరు 29 ఏళ్ల పురుషుడు, 54 ఏళ్ల మహిళ. ఈ ఇద్దరు బాధితులతో వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం బీఏ4, బీఏ5 వేరియంట్ కేసుల సంఖ్య 19కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ముంబైలో కోవిడ్ కేసులు:
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 2,366 తాజా COVID-19 కేసులు నమోదు కాగా… ఇద్దరు మృతి చెందారు. రాయ్‌గఢ్ జిల్లాలో గత 24 గంటల్లో శ్వాసకోశ అనారోగ్యంతో మరణించారని.. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు లేని ఏకైక జిల్లా నందుర్బార్ గా పేర్కొంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 79,23,697మంది కొవిడ్ బారినపడగా, వైరస్ వల్ల 1,47,880 మంది మరణించారని ఆరోగ్య శాఖ తెలిపింది.
మహారాష్ట్ర కరోనావైరస్ గణాంకాలు క్రింది విధంగా ఉన్నాయి:
మొత్తం కేసులు 79,23,697, తాజా కేసులు 4,255, మరణాల సంఖ్య 1,47,880, కోలుకున్న వారి సంఖ్య 77,55,183, క్రియాశీల కేసులు 20,634 నమోదు కాగా.. ఇప్పటి వరకూ రాష్ట్రం మొత్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు 8,14,72,916.
పెరుగుతున్న మరణాలపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన:
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల నమోదు తగ్గుతున్నా.. కరోనాతో మరణాల సంఖ్య గత ఐదు వారాలుగా 4శాతం మేర పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
మరిన్ని కరోనా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..