Corona: లక్షణాలు కనిపించని రోగుల్లో దీర్ఘకాలిక కరోనా.. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలే.!

|

Jun 18, 2021 | 5:02 PM

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వివిధ రూపాల్లో తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. ''మీరు ఏం చేసినా నా నుంచి తప్పించుకోలేరన్నట్టుగా'' రోజుకో..

Corona: లక్షణాలు కనిపించని రోగుల్లో దీర్ఘకాలిక కరోనా.. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలే.!
US Coronavirus
Follow us on

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వివిధ రూపాల్లో తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. ”మీరు ఏం చేసినా నా నుంచి తప్పించుకోలేరన్నట్టుగా” రోజుకో రూపంలో విరుచుకుపడుతోంది. మొదటి వేవ్‌ నుంచి కోలుకుని ఊపిరి పీల్చుకునేలోపు సెకండ్‌ వేవ్‌ అంటూ వచ్చిపడింది. ఈ సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఇతర దేశాల కంటే భారత్‌లో ఎక్కువగా చూపింది. ఈ మహమ్మారి నుంచి ఇప్పడిప్పుడే కాస్త కోలుకుంటున్నా.. కరోనా మాత్రం “తగ్గేదే లే..” అంటోంది.

కరోనా ముప్పు నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. క్రమంగా సాధారణ జీవనం ప్రారంభం అవుతున్నది. చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ, లక్షణాలు కనిపించకపోవడంతో వారిలో కరోనా ఎంతకాలం ఉంటుంది అనే దానిపై అమెరికాకు చెందిన ఫెయిర్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఓ పరిశోధన నిర్వహించింది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు నమోదైన వారి వివరాలను సేకరించి పరిశోధనలు జరిపింది.

ఈ పరిశోధనలో అనేక విషయాలు వెలుగుచూశాయి. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగి, లక్షణాలు కనిపించని వారిలో 19 శాతం మందిలో కరోనా దీర్ఘకాలంగా ఉన్నట్టు గుర్తించారు. నాలుగు వారాల కంటే ఎక్కువకాలం కరోనా వైరస్ శరీరంలో ఉంటే దానిని దీర్ఘకాల కరోనాగా గుర్తించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ప్రారంభంలో వైరస్‌ను గుర్తించినప్పటికీ ఆసుపత్రుల్లో చేరకపోవడం వల్లనే ఎక్కువగా మరణాలు సంభవించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. దీర్ఘకాల కోవిడ్‌ను గుర్తించిన బాధితుల్లో ఎక్కువమంది మహిళలే ఉన్నట్లు తెలిపారు. ఈ సమస్య వల్ల డిప్రెషన్‌, ఆందోళన వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నట్లు వెల్లడించారు.

Also Read:

గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టె.. అందులో ఎర్రని వస్త్రంలో చిన్నారి.! ఎక్కడ నుంచి వచ్చిందంటే.!

మీ బ్యాంక్ ఖాతాలోకి ఎల్‌పీజీ సబ్సిడీ డబ్బు రాలేదా.? ఫిర్యాదు చేయండిలా.! వివరాలివే..

 పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ సౌకర్యాన్ని ఉద్యోగం కోల్పోయినా పొందొచ్చు.!

కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్ సంకేతాలు.. జూన్ 20 నుంచి మరిన్ని సడలింపులు..!