Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: త్వరలో 100 అమృత్‌ భారత్‌ రైళ్లు.. తెలుగు రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు.. కాజీపేటలో..

2026లోపు దేశమంతా కవచ్‌ టెక్నాలజీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రైల్వే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ముఖ్య స్టేషన్ల పరిధిలో కవచ్‌ టెక్నాలజీని వేగంగా ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో అన్ని చోట్ల పూర్తిచేస్తామని తెలిపారు. అలాగే.. సికింద్రాబాద్‌లో కవచ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Indian Railways: త్వరలో 100 అమృత్‌ భారత్‌ రైళ్లు.. తెలుగు రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు.. కాజీపేటలో..
Indian Railways
Shaik Madar Saheb
|

Updated on: Feb 03, 2025 | 4:53 PM

Share

2026లోపు దేశమంతా కవచ్‌ టెక్నాలజీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రైల్వే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ముఖ్య స్టేషన్ల పరిధిలో కవచ్‌ టెక్నాలజీని వేగంగా ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో అన్ని చోట్ల పూర్తిచేస్తామని తెలిపారు. అలాగే.. సికింద్రాబాద్‌లో కవచ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు జరిగాయని తెలిపారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో సోమవారం అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. త్వరలో దేశవ్యాప్తంగా 100 అమృత్‌ భారత్‌ రైళ్లు కూడా వస్తాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 200 వందే భారత్ రైళ్లు కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మొత్తం రైల్వే నెట్‌వర్క్‌లో ఆటోమేటిక్ రైలు రక్షణ (automatic train protection -ATP) టెక్నాలజీ కవాచ్‌ను అమలు చేస్తామని తెలిపారు. 2026 నాటికి కవాచ్ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని.. రైల్వే భద్రత కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ఇండియన్ రైల్వే కోసం 2.52 లక్షల కోట్లను కేంద్ర బడ్జెట్‌లో కేటాయించినట్లు తెలిపారు.

రైల్వేబడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.9,417 కోట్లు కేటాయింపులు జరిగాయని తెలిపారు. ఏపీలో రూ.84,559 కోట్ల పనులు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు.. అలాగే.. ఏపీలో 73 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 1560 కి.మీ.కొత్త రైల్వేలైన్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఏపీకి యూపీఏ హయాం కంటే.. ఎక్కువ నిధులను కేటాయించినట్లు తెలిపారు. ఏపీకి 11 రెట్ల కేటాయింపులు పెరిగాయని వివరించారు.

ఇక రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5337 కోట్లు నిధులు మంజూరు చేశామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాజీపేటలో రైల్వేప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణకు రూ.41,677 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 1326కి.మీ కవచ్‌ టెక్నాలజీ పనిచేస్తోందని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..