స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతుల్లో అగ్రగామిగా భారత్‌.. ప్రధాని మోడీదే ఈ క్రెడిట్‌: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌

|

Apr 13, 2023 | 9:58 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 11 బిలియన్ డాలర్లకు చేరుకుందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖా మంత్రి కమ్యూనికేషన్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తద్వారా గ్లోబల్ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో భారత్..

స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతుల్లో అగ్రగామిగా భారత్‌.. ప్రధాని మోడీదే ఈ క్రెడిట్‌: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌
Ashwini Vaishnaw
Follow us on

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 11 బిలియన్ డాలర్లకు చేరుకుందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖా మంత్రి కమ్యూనికేషన్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తద్వారా గ్లోబల్ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో భారత్ అగ్రగామిగా ఎదిగేందుకు మరో అడుగు ముందుకు పడిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘స్మార్ట్‌ఫోన్‌ల ఎగుమతులు 11 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయ గ్లోబల్ మొబైల్‌ మార్కెటింగ్‌, అలాగే ఎలక్ట్రానిక్‌ ఎగుమతుల్లో భారత్‌ అగ్రగామిగా నిలుస్తుందనడానికి ఇదే నిదర్శనం. ఇది ప్రధానమంత్రి మోడీ సాధించిన గొప్ప విజయం. ఆయన ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన మేక్‌ ఇన్‌ ఇండియా ఎంతో సత్ఫలితాలనిస్తుంది. ‘ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) గణాంకాల ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుండి మొబైల్ ఫోన్‌ల ఎగుమతి రూ. 45,000 కోట్ల నుండి రూ. 90,000 కోట్లకు రెండింతలు పెరిగి, దాదాపు USD 11.12 బిలియన్లకు చేరుకుంది. అలాగే ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు కూడా 58 శాతం పెరిగి రూ.1,85,000 కోట్లకు చేరుకున్నాయి. ఏడాదికి రూ. 75,000 కోట్ల లక్ష్యాన్ని అధిగమించడం చాలా సంతోషాన్నిస్తుంది’ అని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో యాపిల్‌ ఫోన్లు రికార్డు స్థాయిలో ఎగుమతి అయ్యాయి. వీటి విలువ సుమారు 5 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ. 40,000 కోట్లు). ఇక మొత్తం ఐఫోన్ ఉత్పత్తిలో భారతదేశం ఇప్పుడు 5% వాటాను కలిగి ఉంది. 2020లో ఇది 1% కంటే తక్కువగా ఉంది. చైనా రెండవ స్థానంలో భారత్‌తో పాటు ఐఫోన్‌ల తయారీలో అతిపెద్ద దేశంగా కొనసాగుతోంది. అలాగే రూ. 36,000 కోట్ల విలువైన ఎగుమతులతో శాంసంగ్ రికార్డు సృష్టించింది. భారతదేశం ఇప్పుడు UK, ఇటలీ, ఫ్రాన్స్, మిడిల్ ఈస్ట్, జపాన్, జర్మనీ, రష్యాతో సహా అభివృద్ధి చెందిన దేశాలకు కూడా స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..