ASEAN-India Summit: చైనా ఆటలకు చెక్ పెట్టే దిశగా.. ఆసియన్ వికేంద్రీకరణకు భారత్ సంపూర్ణ మద్దతు..

| Edited By: Ram Naramaneni

Sep 07, 2023 | 1:43 PM

ASEAN సదస్సులో పాల్గొన్న ఇతరదేశాల నేతలతో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రధాని మోడీ "ఆసియాన్-ఇండియా సమ్మిత్ లో మా భాగస్వామ్య దృక్పథం, మెరుగైన భవిష్యత్తు కోసం సహకారానికి నిదర్శనం. మానవ పురోగతిని పెంపొందించే భవిష్యత్ రంగాల్లో కలిసి పనిచేయడానికి తాము  ఎదురుచూస్తున్నామని ఈ ఫోటోకి క్యాప్షన్ జత చేశారు. 

ASEAN-India Summit: చైనా ఆటలకు చెక్ పెట్టే దిశగా.. ఆసియన్ వికేంద్రీకరణకు భారత్ సంపూర్ణ మద్దతు..
Asean India Summit
Follow us on

ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన ఆసియాన్-భారత్ 18వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఆగ్నేయాసియా దేశాల మధ్య సహకారం ఉండాలని సూచించారు. ఆసియాన్-భారత్ సదస్సుకు భారత్ పూర్తి మద్దతుని అందించిందని.. భారతదేశం’యాక్ట్ ఈస్ట్’ విధానానికి ASEAN సదస్సుకు మూల స్థంభం అని కూడా ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ వ్యూహంలో భారతదేశానిదే కీలక పాత్రని స్పష్టం చేశారు.

ఆసియాన్‌లో ‘కొత్త ప్రచ్ఛన్న యుద్ధం’ గురించి చైనా హెచ్చరించిన నేపథ్యంలో ప్రధాని మోడీ ఆసియా శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ ఘాటుగా స్పందించారు. ఆసియాన్-భారత్ కేంద్రీకృతానికి, ఇండో-పసిఫిక్‌పై ఆసియాన్ దృక్పథానికి భారతదేశం సంపూర్ణ మద్దతు ఇస్తుంది” అని ప్రధాన మంత్రి మోడీ చెప్పారు. అంతేకాదు “అంతర్జాతీయ చట్టం అన్ని దేశాలకు సమానంగా వర్తించేలా చేయాలని సూచించారు.  అంతే కాదు “ప్రస్తుతం ప్రపంచంలో క్లిష్ట పరిస్థితులు, అనిశ్చిత పరిస్థితులున్నాయని.. ఉగ్రవాదం, తీవ్రవాదం, భౌగోళిక రాజకీయ సంఘర్షణలు మనందరికీ పెద్ద సవాళ్లు” అని  ఈ సదస్సులో పాల్గొన్న ఇతర దేశాల నాయకులతో అన్నారు. అంతేకాదు మన చరిత్ర, భౌగోళిక శాస్త్రం భారత్, ఆసియాన్‌లను కలుపుతాయని ప్రధాన మంత్రి మోడీ చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఈ సదస్సులో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, మానవ హక్కుల పట్ల గౌరవం వంటి ఉమ్మడి విలువలను కూడా పంచుకోవాలని భాగస్వామ్య విలువలతో పాటు, ప్రాంతీయ ఐక్యత, శాంతి, శ్రేయస్సు, బహుళ ధృవ ప్రపంచంలో పరస్పర విశ్వాసం కూడా మనల్ని బంధిస్తాయి అని ప్రధాని మోడీ అన్నారు. అంతేకాదు ఈ సదస్సులో పాల్గొన్న ఇతర దేశాల నేతలతో నియమాల ఆధారిత అంతర్జాతీయ క్రమం కోసం పిలుపునిచ్చారు. అవి “వివిధ ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవటానికి ముఖ్యమైనవి” అని అన్నారు.

భారతదేశం, ద్వైపాక్షిక కూటమి మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం సంబంధాలలో కొత్త చైతన్యాన్ని నింపిందని కూడా ప్రధాన మంత్రి మోడీ స్పష్టం చేశారు. ప్రపంచ వృద్ధిలో ఆసియా దేశాలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్నారు.

ASEAN సదస్సులో పాల్గొన్న ఇతరదేశాల నేతలతో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రధాని మోడీ “ఆసియాన్-ఇండియా సమ్మిత్ లో మా భాగస్వామ్య దృక్పథం, మెరుగైన భవిష్యత్తు కోసం సహకారానికి నిదర్శనం. మానవ పురోగతిని పెంపొందించే భవిష్యత్ రంగాల్లో కలిసి పనిచేయడానికి తాము  ఎదురుచూస్తున్నామని ఈ ఫోటోకి క్యాప్షన్ జత చేశారు.

జకార్తా శిఖరాగ్ర సదస్సులో దక్షిణ చైనా సముద్రంలో చైనా జరుపుతున్న వాణిజ్యం, సముద్రంలో చైనా జరుపుతున్న కార్యకలాపాలపై ఆసియాలోని పలు దేశాలు ఆందోళల చెందుతున్న నేపథ్యంలో ఆసియాన్ కేంద్రీకరణకు ప్రధాన మోడీ పూర్తి మద్దతును ప్రకటించడంతో వ్యూహాత్మక ప్రాముఖ్యతను సంతరించుకుంది.

బుధవారం శిఖరాగ్ర సమావేశాన్ని ఉద్దేశించి చైనా ప్రధాని లీ కియాంగ్ మాట్లాడుతూ.. దేశాల మధ్య వివాదాలతో వ్యవహరించేటప్పుడు “కొత్త ప్రచ్ఛన్న యుద్ధాన్ని” నివారించడం చాలా ముఖ్యంమని దేశాల మధ్య విభేదాలు, వివాదాలను సముచితంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని జకార్తాలో మోడీ చేసిన ప్రకటనతో ప్రాధ్యాన్యత సంతరించుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..