కేజ్రీవాల్ నకిలీ భక్తుడట ! బీజేపీ ఎద్దేవా.. తిప్పికొట్టిన ఢిల్లీ సీఎం

| Edited By: Anil kumar poka

Feb 08, 2020 | 1:59 PM

ఢిల్లీ ఎన్నికల సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైన, ఆయన ఆలయ పూజలపైన, బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సందిస్తుండగా.. తానేమీ తక్కువతినలేదన్నట్టు కేజ్రీ కూడా తన ట్విట్టర్ లో ఆ పార్టీని ఏకిపారేస్తున్నారు. గత గురువారం ఆయన నగరంలోని ఓ హనుమాన్ ఆలయంలోకి వెళ్లి అక్కడ ప్రార్థనలు చేసిన వీడియోను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా.. కేజ్రీవాల్ ఈ గుడిలో ప్రవేశించే ముందు తన […]

కేజ్రీవాల్ నకిలీ భక్తుడట ! బీజేపీ ఎద్దేవా.. తిప్పికొట్టిన ఢిల్లీ సీఎం
Follow us on

ఢిల్లీ ఎన్నికల సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైన, ఆయన ఆలయ పూజలపైన, బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సందిస్తుండగా.. తానేమీ తక్కువతినలేదన్నట్టు కేజ్రీ కూడా తన ట్విట్టర్ లో ఆ పార్టీని ఏకిపారేస్తున్నారు. గత గురువారం ఆయన నగరంలోని ఓ హనుమాన్ ఆలయంలోకి వెళ్లి అక్కడ ప్రార్థనలు చేసిన వీడియోను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా.. కేజ్రీవాల్ ఈ గుడిలో ప్రవేశించే ముందు తన కాళ్ళ చెప్పులను గడప వద్ద వదిలి.. ఆలయంలోపల హనుమాన్ విగ్రహానికి అవే చేతులతో పూలమాల వేసిన దృశ్యాన్ని తివారీ ‘హైలైట్’ చేశారు. ఇలా చేసి  కేజ్రీ ఆలయాన్ని అపవిత్రం చేశారని ఆరోపించారు.  ఈ సీఎం నకిలీ భక్తుడని విమర్శించారు. అయితే.. భగవంతుడు బీజేపీతో సహా అందరివాడని, ప్రతివారూ దేవుడిని పూజించవచ్ఛునని కేజ్రీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ ఇవేం రాజకీయాలు’ ? అని ప్రశ్నించిన ఆయన.. తాను రోజూ హనుమాన్ చాలీసా పఠిస్తానని, గుడి తలుపుల ముందు తన చెప్పులను వదిలినంత మాత్రాన, దేవునిపై తన భక్తి గురించి తనకు తెలుసునన్నారు. మరోవైపు.. ఆప్ నేత సంజయ్ సింగ్.. బీజేపీ నేతలను ఉద్దేశించి.. మీరింకా దళితులను ఆలయంలోకి ప్రవేశించనివ్వని అగ్రవర్ణాల కాలంలోనివారిలాగే ఉన్నారని ఎత్తిపొడిచారు. మీ పార్టీని రాముడు కూడా రక్షించలేడని దుయ్యబట్టారు.