Kejriwal: ప్రధాని మోదీ నినాదాన్ని తీసుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఇద్దరి మధ్య చిన్న తేడా..

|

Aug 17, 2022 | 4:25 PM

విదేశీ దిగుమతులను తగ్గించుకుని.. దేశానికి అవసరమైన అన్నింటిని స్వదేశంలోనే తయారుచేసి.. అన్ని రంగాల్లో స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని..

Kejriwal: ప్రధాని మోదీ నినాదాన్ని తీసుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఇద్దరి మధ్య చిన్న తేడా..
Arvind Kejriwal
Follow us on

Kejriwal: విదేశీ దిగుమతులను తగ్గించుకుని.. దేశానికి అవసరమైన అన్నింటిని స్వదేశంలోనే తయారుచేసి.. అన్ని రంగాల్లో స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ఇచ్చింది. దీనికి తగినట్లు రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలను స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసుకునే స్థాయికి చేరుతోంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈరోజు మేకిన్ ఇండియా నెంబర్ 1 మిషన్ ను ఈరోజు ఢిల్లీలో ప్రారంభించారు. ఈరెండింటికి చిన్న తేడా ఉంది. అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మేడిన్ ఇండియా నినాదాన్ని ఇవ్వగా.. ప్రపంచంలో భారత్ ను నెంబర్ వన్ దేశంగా మార్చాలంటూ అరవింద్ కేజ్రీవాల్ మేకిన్ ఇండియా నెం.1 నేషనల్ మిషన్ కు శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 130 కోట్ల మంది భారతీయులు ఈమిషన్ కు అనుసంధానం కావాలని పిలుపునిచ్చారు.

భారత్ వేల సంవత్సరాల చరిత్ర కలిగిన, పురాతన దేశమని పేర్కొన్నారు. భారత్ దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా చూడాలనుకుంటున్నానని తెలిపారు. భారత్ ధనిక దేశంగా మారాలని అందరూ కోరుకుంటున్నారని.. అయితే ప్రతి భారతీయుడు ధనవంతుడు కావాలని తాను కోరుకుంటున్నాని చెప్పారు. అలా జరిగితే భారత్ ధనిక దేశం అవుతుందన్నారు. దేశంలో విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపడటానికి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..