Amrita Sher-Gil: ఆ చిత్రకారిణి మరణం ఇప్పటికీ మిస్టరీనే.. ఆమె వేసిన పెయింటింగ్ వేలం.. రికార్డ్ ధర పలికిన వైనం

Amrita Sher-Gil: ప్రపంచ వ్యాప్తంగా కళకు.. కళాకారులకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంది. కళాకారుల నైపుణ్యాన్ని గుర్తించి పట్టంగడుతూనే ఉన్నారు...

Amrita Sher-Gil: ఆ చిత్రకారిణి మరణం ఇప్పటికీ మిస్టరీనే.. ఆమె వేసిన పెయింటింగ్ వేలం.. రికార్డ్ ధర పలికిన వైనం
Amrita Sher Gil Painting

Edited By: Surya Kala

Updated on: Jul 16, 2021 | 3:15 PM

Amrita Sher-Gil: ప్రపంచ వ్యాప్తంగా కళకు.. కళాకారులకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంది. కళాకారుల నైపుణ్యాన్ని గుర్తించి పట్టంగడుతూనే ఉన్నారు. తాజాగా అమృతా షేర్-గిల్ యొక్క “ఇన్ ది లేడీస్ ఎన్‌క్లోజర్” పెయింటింగ్ రికార్డ్ స్థాయిలో అమ్ముడైంది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన రెండవ భారతీయ కళగా ఖ్యాతి గాంచింది.

1938 లో షేర్-గిల్ కాన్వాస్‌పై చిత్రీకరించిన ‘ఇన్ ది లేడీస్ ఎన్‌క్లోజర్’ పెయింటింగ్ ను తాజాగా వేలం వేశారు. ఈ కళాఖండం రూ.37.8 కోట్లకు కళా ప్రియులు సొంతం చేసుకున్నారు.

షేర్-గిల్ భారతదేశానికి తిరిగి వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత, కళాకారిణిగా ప్రపంచ రికార్డును సృష్టించింది.
20వ శతాబ్దానికి ప్రముఖ భారతీయ చిత్రకారిణి. 30 జనవరి 1913న అమృత జన్మించారు. 1941 డిసెంబరు 5 మరణించారు. అమృత అమృత తండ్రి పంజాబీ, తల్లి హంగేరీ. హంగేరియన్-యూదు ఒపెరా గాయని మేరీ ఆంటోనిట్టే గొట్టెస్మాన్, ఫోటోగ్రాఫర్ అయిన ఉమ్రావ్ సింగ్ షేర్-గిల్ మజితియా

అమృత 1949 లో పారిస్‌లోని ఎకోల్ డెస్ బ్యూక్స్-ఆర్ట్స్‌లో చిత్రకళను అభ్యసించారు. 1934 లో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, అమృత చిత్రకళా శైలి విభిన్న రూపాయాన్ని సంతరించుకుంది. ఇప్పుడు తన పరిసరాలను ప్రేరణగా తీసుకుని చిత్రాలకు ప్రాణం పోశారు. ముఖ్యంగా గోరఖ్‌పూర్‌లోని ఆర్టిస్ట్ ఫ్యామిలీ ఎస్టేట్‌లో అనేక కార్యకలాపాలలో నిమగ్నమైన మహిళల బృందాన్ని తన చిత్రానికి ప్రేరణగా తీసుకున్నారు. వేలంలో అమ్ముడైన చిత్రం అమృత నైపుణ్యానికి, ప్రతిభకు నిదర్శనంగా ఈ చిత్రం నిలిచింది. 2015 లో న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్‌లో అమృత వేసిన పెయింటింగ్‌లు కొలువుదీరాయి.

1941లో లాహోర్ లో అత్యంత భారీ కళా ప్రదర్శన ప్రారంభించే కొద్ది రోజుల ముందు, అమృతా తీవ్రమైన అనారోగ్యం బారిన పడి కోమా లోకి వెళ్ళిపోయారు. 1941 డిసెంబరు 6 అర్థరాత్రి  కన్ను మూశారు.

Also Read: ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. భారీగా సబ్సిడీ..