Snacks: అతిథులకు స్నాక్స్ వడ్డింపు.. 200 మందికి ఫుడ్ పాయిజన్‌

Assam Jolpan: స్థానిక అధికారులు తెలిపిన సమాచారం మేరకు.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అస్సామీ సాంప్రదాయ వంటకమైన జల్పాన్‌ను వడ్డించారు. ఇది తిన్న తర్వాత 200 మందికి పైగా అతిథులు ఫుడ్ పాయిజన్‌ కావడంతో అస్వస్థతకు గురైయ్యారు.

Snacks: అతిథులకు స్నాక్స్ వడ్డింపు.. 200 మందికి ఫుడ్ పాయిజన్‌
Assam Jolpan
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 20, 2024 | 10:49 PM

అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ కార్యక్రమంలో వడ్డించిన స్నాక్స్‌ తిన్న తర్వాత దాదాపు 200మంది అస్వస్థతకు గురైయ్యారు. ప్రదీప్ గొగోయ్ అనే వ్యక్తి ఇటీవల మరణించిన తన తల్లి స్మారక కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన బంధువులకు శనివారంనాటి రాత్రి అస్సాం సంప్రదాయ వంటకమైన జల్పాన్‌ను వడ్డించారు. జల్పాన్‌ను పఫ్డ్ రైస్, క్రీమ్‌తో తయారుచేస్తారు. స్నాక్స్‌ తిన్న కొద్ది సేపటికి అతిథులు అస్వస్థతకు గురవ్వడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, విరేచనాలతో 53 మంది సరుపాతర్ టౌన్, ఉరియంఘాట్‌లోని ఆస్పత్రుల్లో అడ్మిట్ అయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జోర్హాట్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

ఆస్పత్రిలో చేరిన వారిలో చాలా మంది పరిస్థితి మెరుగుపడటంతో ఆదివారం నాడు వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మరో 150 మందికి స్వల్ప అస్వస్థతతో వారి ఇళ్లలోనే కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. సరుపాతర్ ఎమ్మెల్యే బిస్వజిత్ ఫుకాన్ ఆస్పత్రికి వెళ్లి ఫుడ్ పాయిజన్‌తో అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు స్థానిక హెల్త్ అధికారులు తెలిపారు. అలాగే వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఈ కార్యక్రమంలో స్నాక్ తిన్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఎలాంటి ఫుడ్ పాయిజన్ లక్షణాలు కనిపించలేదని మీడియాకు తెలిపారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!