పాకిస్థాన్ తన వక్రబుద్దిని మరోసారి ప్రదర్శిస్తోంది. గతకొద్ది రోజులుగా సైలంట్‌గా ఉందనుకున్న వేళ.. మళ్లీ సరిహద్దుల్లో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. సోమవారం భారత్ – పాక్ నియంత్రణ రేఖ వద్ద.. పాక్ కాల్పులకు దిగింది. కశ్మీర్‌లోని బందిపొరా జిల్లా గురేజ్ సెక్టార్‌లో.. భారత సైన్యమే టార్గెట్‌గా కాల్పులకు దిగింది. అప్రమత్తమైన సైన్యం.. పాక్ చర్యలను ధీటుగా ఎదుర్కొంది. ఈ క్రమంలో పాక్ జరిపిన కాల్పుల్లో భారత జవాన్ ఒకరు వీరమరణం పొందారు. తొలుత పాక్ సైన్యమే కాల్పులు జరిపి రెచ్చగొట్టారని అధికారులు వెల్లడించారు. మరోసారి ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగుతే.. గట్టి సమాధానం చెబుతామని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.