Watch Video: ఎట్టకేలకు చిక్కిన అరికొంబన్ ఏనుగు.. ఎలా పట్టుకున్నారంటే

|

Jun 05, 2023 | 12:54 PM

Elephant Arikomban: తమిళనాడులోని ఇటీవల తేని జిల్లాలో అరికొంబన్ అనే ఏనుగు బీభత్సం సృష్టించించిన విషయం తెలిసిందే. పలు గ్రామాల్లో అయితే 144 సెక్షన్‌ను కూడా విధించారు. ఇప్పటికే ఈ ఏనుగు దాడిలో ఇద్దరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని పట్టుకునేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేశారు.

తమిళనాడులోని ఇటీవల తేని జిల్లాలో అరికొంబన్ అనే ఏనుగు బీభత్సం సృష్టించించిన విషయం తెలిసిందే. పలు గ్రామాల్లో అయితే 144 సెక్షన్‌ను కూడా విధించారు. ఇప్పటికే ఈ ఏనుగు దాడిలో ఇద్దరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని పట్టుకునేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేశారు. దాదాపు 20 రోజుల నుంచి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా భయాందోళనకు గురిచేస్తోన్న ఈ ఏనుగు ఎట్టకేలకు అధికారులకు పట్టుబడింది. సోమవారం తెల్లవారుజామున కంబమ్ ఈస్ట్ రేంజ్‌లో ఫారెస్ట్ వెటర్నరీ సర్జన్లు, అటవీ శాఖ అధికారుల బృందం దానికి 2 మత్తు ఇంజెక్షన్ షాట్లు వేసి  చాకచక్యంగా పట్టుకున్నారు.

అయితే ఈ పట్టుబడిన అరి కొంబన్ ఏనుగును తేని జిల్లాకు ఆనుకుని ఉన్న వెల్లిమలై ప్రాంతంలో విడిచిపెట్టాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఏనుగుకు చాలా గాయాలు కావడంతో.. చికిత్స కోసం తొలుత ముడుమలై అటవీ ప్రాంతానికి వెళ్లనున్నారు. అనంతరం దాన్ని అడవిలో విడిచిపెట్టాలని భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఏనుగును ఏ ప్రాంతంలో విడుదల చేయబోతున్నారనే దానిపై అధికారికంగా సమాచారం ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం