ఢిల్లీ సర్కార్, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. మీరంటే మీరుంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రోహింగ్యా శరణార్థులకు వసతి కల్పించే అంశంపై ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. ఇప్పుడు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు. కేజ్రీవాల్ ప్రభుత్వం రోహింగ్యా ముస్లింలకు ఉచితంగా ఫ్లాట్లు ఇవ్వాలనుకుంటోందని విమర్శించారు. ఆప్ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. రోహింగ్యాలపై సానుభూతి ఎందుకు? అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఏ శాఖ లేదు. అందుకే రోహింగ్యాలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారని అన్నారు. దాని అధికారులు రోహింగ్యాలకు EWS ఫ్లాట్‌లు ఇవ్వడం గురించి ఎందుకు మాట్లాడారంటూ ప్రశ్నించారు.
ఆయన ఆరోగ్య మంత్రి గురించి అడిగితే స్పందించడం లేదు..? మద్యం పాలసీపై స్పందించడం లేదు..? ఉచితాలను మాత్రమే పంపిణీ చేస్తుంది. ఇప్పుడు రోహింగ్యాలకు ఉచితంగా ఫ్లాట్లు ఇవ్వడానికి వెళ్లారు. ఇవి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాదా అని ఎద్దేవ చేశారు. దేశ భద్రతను తారుమారు చేయడానికి ఆప్ ప్రభుత్వం వెనకాడటం లేదని విమర్శించారు.
I’d like to clarify, HMO has articulately said that Rohingya illegal migrants won’t be considered citizens of India. They will be sent back; MEA is in talks for the same. This is the last statement: Union Minister Anurag Thakur, in Delhi pic.twitter.com/VxQ3qQLZO6
— ANI (@ANI) August 18, 2022
వారు (AAP GOVT) ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ భద్రతకు రాజీ పడేందుకు సిద్ధపడుతున్నారని అన్నారు. జాతీయ భద్రత మాకు అత్యంత ముఖ్యమైనది. మేము ఇంతకు ముందు చెప్పినట్లుగా.. అక్రమ వలసదారులకు ఇక్కడ ఆశ్రయం ఇవ్వబడదు. రోహింగ్యాలను వెనక్కి పంపేందుకు చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. అక్రమ వలసదారులను భారత పౌరులుగా పరిగణించబోమని కేంద్ర హోం శాఖ ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు.
Delhi | Rohingyas who live here & are illegal migrants are given free water, electricity, ration; now even flats were to be given to them by Delhi govt… they have lied again, distributed ‘Revdis’… why could he (CM Kejriwal) not ready detention centers: Union Min Anurag Thakur pic.twitter.com/Enq3q60ksU
— ANI (@ANI) August 18, 2022
రోహింగ్యా శరణార్థుల విషయంలో కేంద్రం వైఖరి ఏంటి?
దేశంలో ఆశ్రయం పొందిన వారిని భారతదేశం ఎల్లప్పుడూ స్వాగతిస్తున్నదని, రోహింగ్యా శరణార్థులందరినీ తూర్పు ఢిల్లీలోని బక్కర్‌వాలా ప్రాంతంలోని EWS ఫ్లాట్‌లకు తరలిస్తామని బుధవారం కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి పూరీ ట్వీట్ చేశారు. కానీ సాయంత్రానికి మరో ప్రకటన చేసింది హోం మంత్రిత్వ శాఖ.
మరిన్ని జాతీయ వార్తల కోసం