AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shefali Jariwala Death: షెఫాలీ మరణం వెనుక మిస్టరీ ఏంటి..? అందమే ఆమెను చంపిందా..?

కాంటా లగా గర్ల్ షెఫాలీ మరణం వెనుక మిస్టరీ ఇంకా వీడలేదు. హఠాత్తుగా చనిపోవడం వెనుక అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అయితే పోలీసుల విచారణలో ఓఇంపార్టెంట్ లీడ్ ఒకటి దొరికింది. ఇంతకూ ఏంటా లీడ్.? ఆమె మృతికి అదే కారణమా ? ఓవర్‌డోస్‌తోనే ఆమె చనిపోయారా.? అసలు షెఫాలీ ఇంట్లో ఆరోజు ఏం జరిగింది.?

Shefali Jariwala Death: షెఫాలీ మరణం వెనుక మిస్టరీ ఏంటి..? అందమే ఆమెను చంపిందా..?
Shefali Jariwala
Ram Naramaneni
|

Updated on: Jun 29, 2025 | 9:44 PM

Share

షఫాలి జరివాలా…42ఏళ్ల వయసు. చనిపోయే ఏజ్ అస్సలు కాదు. చిన్నపాటి సమస్యలు తప్ప ఆరోగ్య సమస్యలు అస్సలు లేవు. కానీ ఆమె హఠాత్తుగా చనిపోవడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. ఇప్పుడు పోలీస్ ఇంటరాగేషన్‌లో దొరికిన లీడ్..యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్….

యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ కొందరు సినిమావాళ్లు తరచుగా వినియోగించే ఇంజెక్షన్. ఏజ్ తెలియకుండా..యవ్వనంగా కనిపించేందుకు దీన్ని డాక్టర్ల పర్యవేక్షణలో వాడతారు. షఫాలీ కూడా గత ఎనిమిదేళ్లుగా యాంటీ ఏజింగ్ ఇంజక్షన్లు తీసుకుంటున్నారని బాలీవుడ్ న్యూస్. డాక్టర్ సలహాతో నెలవారీగా తీసుకుంటారని తెలుస్తోంది. జూన్ 27న కూడా ఆమె ఈ ఇంజెక్షన్ తీసుకున్నారు. అయితే ఆరోజు ఆమె ఉపవాస దీక్షలో ఉన్నారు. ఈ ఇంజక్షన్ తీసుకున్న కొద్దిసేపటికే ఆమెకు ఒళ్లు వణకడం, తర్వాత స్పృహ కోల్పోయారని తెలుస్తోంది. వెంటనే ఆమె భర్త పరాగ్ త్యాగి ముంబైలోని బెల్లెవ్యూ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయింది. విచారణలో భాగంగా షెఫాలీ ఇంట్లో యాంటీ ఏజింగ్ ఇంజక్షన్ వైల్స్, విటమిన్ సప్లిమెంట్లు, గ్యాస్ట్రిక్ మాత్రలు దొరికాయి. ఆమె ఉపవాసంతో ఉన్న టైంలో ఇంజక్షన్ తీసుకోవడం వల్ల రక్తపోటు ఒక్కసారిగా పడిపోయి గుండెపోటు వచ్చి ఉంటుందని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు.

యాంటీ ఏజింగ్ ఇంజక్షన్లు, సాధారణంగా చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి ఉపయోగిస్తారు. చర్మం రంగును మెరుగుపరుచుకోవడం కోసం, ముడతలను తగ్గించడం కోసం కొందరు వీటిని తరచూ తీసుకుంటారు. అయితే ఈ ఇంజెక్షన్లు గుండె సమస్యలు, ఎపిలెప్సీ వంటి ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. షఫాలీ జరివాలా కేసులో కూడా ఇదే జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆమె ఉపవాసం ఆచరిస్తూ ఇంజక్షన్ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తపోటు ఒక్కసారిగా పడిపోయి గుండెపోటు వచ్చి ఉండొచ్చని తెలుస్తోంది. యాంటీ ఏజింగ్ ఇంజక్షన్లు ఇతర మందులతో కలిసినప్పుడు, లేకపోతే ఉపవాసం లాంటి దీక్షల్లో తీసుకున్నప్పుడు ఆరోగ్యం మరింత ప్రమాదకరంగా మారవచ్చని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. షఫాలీ ఇంట్లో స్వాధీనం చేసుకున్న మందుల్లో యాంటీ ఏజింగ్ వైల్స్‌తో పాటు విటమిన్, గ్యాస్ట్రిక్ మాత్రలు దొరికాయి. బహుశా వీటి ప్రభావంతోనే చనిపోయి ఉండొచ్చు. పోస్ట్‌మార్టం, ల్యాబ్ రిపోర్టులు వస్తే ఆమె మరణానికి కారణాలు తెలిసే అవకాశం ఉంది.

మామూలుగా చాలా దేశాల్లో ఈ ఇంజక్షన్లు కఠినమైన నియమాల కింద లభిస్తాయి, కానీ మన దేశంలో నియంత్రణ సరిగా లేకపోవడంతో సులభంగా అందుబాటులో ఉన్నాయి. చాలామంది ఈ ఇంజక్షన్లను నియంత్రించాలని, వైద్య సలహా లేకుండా వాడకూడదని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..