Weight loss Surgery: వికటించిన వెయిట్‌ లాస్‌ సర్జరీ.. లబోదిబోమంటున్న మహిళ..

వెయిట్‌ లాస్‌ సర్జీరీస్‌ ప్రాణాంతకంగా మారుతూ హడలెత్తిస్తున్నాయి. బెంగుళూరులో ఫ్యాట్‌ రిమూవల్‌ సర్జరీ వికటించి ఇటీవలే కన్నడ నటి చేతన రాజ్‌ మృతి చెందింది.

Weight loss Surgery: వికటించిన వెయిట్‌ లాస్‌ సర్జరీ.. లబోదిబోమంటున్న మహిళ..
Weight Loss Tips

Edited By:

Updated on: Jun 02, 2022 | 9:54 PM

వెయిట్‌ లాస్‌ సర్జీరీస్‌ ప్రాణాంతకంగా మారుతూ హడలెత్తిస్తున్నాయి. బెంగుళూరులో ఫ్యాట్‌ రిమూవల్‌ సర్జరీ వికటించి ఇటీవలే కన్నడ నటి చేతన రాజ్‌ మృతి చెందింది. ఆ ఘటన మరువకముందే తాజాగా బెంగుళూరులోనే మరో మహిళ తీవ్ర అనారోగ్యం పాలైంది. ఓ ప్రైవేట్‌ కంపెనీలో హెచ్ఆర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ ఫ్యాట్ రిమూవల్‌ సర్జరీ చేయించుకుంది. ఢిల్లీకి చెందిన ఈ మహిళకు బెంగళూరు ఎంఎస్ పాల్య ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. ఆపరేషన్‌ జరిగిన పదిరోజులకు సైడ్‌ఎఫెక్ట్స్‌ మొదలయ్యాయి. శస్త్రచికిత్స జరిగిన చోట శరీరం నల్లగా మారిపోయింది. సర్జరీ చేసిన ప్రాంతంలో వేసిన కుట్ల నుంచి చీము రావడంతో బాధితురాలు భయాందోళనలకు గురైంది. నొప్పి భరించలేని స్థితిలో బాధితురాలు కన్నీరు పెట్టుకుంటూ సోషల్ మీడియాలో తన బాధను వ్యక్తం చేస్తూ వీడియో అప్​లోడ్ చేసింది.

సర్జరీ చేసిన ఆస్పత్రి తనకు సహకరించడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేసింది. చీమును తొలగించేందుకు మళ్లీ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పడంతో బాధితురాలికి భయం పట్టుకుంది. తనకు ఈ పరిస్థితి కల్పించిన వైద్యులపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తానని చెబుతోంది. ఇలా వరుసగా జరుగుతున్న ఈ వెయిట్‌ లాస్‌ సర్జరీలు కలవరపెడుతున్నాయి. ఏదిఏమైనా నాజూక్కా ఉండాలనుకోవడం తప్పుకాదు. అలా అని ఆపరేషన్లూ తప్పు కాదు. కానీ వైద్యుల నిర్లక్ష్యం ప్రాణాలమీదికి తెస్తోంది. మరోవైపు పేషెంట్లు తగు జాగ్రత్తలు పాటించకపోవడమూ వారికి ముప్పుగా మారుతోంది. సో వెయిట్‌లాస్‌ ఆపరేషన్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం అంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి