Crime: ప్రేమను తిరస్కరించిందని రైలు కింద తోసేశాడు.. చనిపోయిందని నిర్థారించుకున్న తర్వాత.. చివరకు

ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. కాదనేసరికి కోపం పెంచుకున్నాడు. తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతూ మరోసారి తన ప్రేమను తెలియజేశాడు. అయినా అతనికి ఛీత్కారాలే ఎదురయ్యాయి. దీంతో వెంటనే యువతిని...

Crime: ప్రేమను తిరస్కరించిందని రైలు కింద తోసేశాడు.. చనిపోయిందని నిర్థారించుకున్న తర్వాత.. చివరకు
Murder Case

Updated on: Oct 14, 2022 | 7:06 AM

ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. కాదనేసరికి కోపం పెంచుకున్నాడు. తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతూ మరోసారి తన ప్రేమను తెలియజేశాడు. అయినా అతనికి ఛీత్కారాలే ఎదురయ్యాయి. దీంతో వెంటనే యువతిని ఎదురుగా వస్తున్న రైలు కిందకు తోసేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధరించుకున్న తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెన్నైలోని టీ టీనగర్​లో నివాసముండే ఓ యువతి.. స్థానిక ప్రైవేట్ కాలేజీలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెకు ఆదంబాక్కంకు చెందిన సతీశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే అతడిని కేవలం స్నేహితుడిగానే యువతి భావించింది. కానీ సతీశ్ మాత్రం ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. తనను ప్రేమించాలని వేధించాడు. యువతి అంగీకరించకపోవడంతో కోపం పెంచుకున్నాడు. ఆమె సంగతి చూడాలని కోపంతో రగిలిపోయాడు.

ఈ సమయంలో.. యువతి ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లేందుకు పరింగిమలై రైల్వే స్టేషన్​లో రైలు కోసం ఎదురు చూస్తోంది. అప్పుడు అక్కడికి వచ్చిన సతీశ్ ఆమెతో గొడవకు దిగాడు. తీవ్ర కోపంలో ఎదురుగా వస్తున్న రైలు కిందకు తోసేశాడు. ఊహించని ఈ ఘటనతో బాధితురాలు రైలు కింద పడి చనిపోయింది. సతీశ్ అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇవి కూడా చదవండి

ఈ విషయంపై రైల్వే పోలీసులకు ప్రయాణికులు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సత్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సతీశ్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.