WITT: ప్రజాస్వామ్య బలోపేతానికి మోదీ పునాది వేశారు.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్‌షా

ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. 'దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి పునాది వేయడానికి ప్రధాని మోదీ కృషి చేశారు. అవినీతి, బంధుప్రీతి, కులతత్వం, బుజ్జగింపుల వంటి వాల్ల ఏ దేశంలోనూ ప్రజాస్వామ్యం వర్ధిల్లలేదు. క్యాన్సర్‌ పుండ్లను తొలగించడం ద్వారా మెరుగైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి ప్రధాని మోదీ కృషి చేశారు...

WITT: ప్రజాస్వామ్య బలోపేతానికి మోదీ పునాది వేశారు.. టీవీ9 సమ్మిట్‌లో అమిత్‌షా
Amit Shah
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 27, 2024 | 10:47 PM

TV9 నెట్‌వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) కార్యక్రమంలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ సాధించిన ఘనతల గురించి వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఇప్పుడు గెలుపొందడం అలవాటు చేసుకుందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. ‘దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి పునాది వేయడానికి ప్రధాని మోదీ కృషి చేశారు. అవినీతి, బంధుప్రీతి, కులతత్వం, బుజ్జగింపుల వంటి వాల్ల ఏ దేశంలోనూ ప్రజాస్వామ్యం వర్ధిల్లలేదు. క్యాన్సర్‌ పుండ్లను తొలగించడం ద్వారా మెరుగైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి ప్రధాని మోదీ కృషి చేశారు. మేము దేశ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తామ’ని అమిత్‌షా చెప్పుకొచ్చారు. ఇక దేశ ప్రతిష్టాత్మక అవార్డుల గురించి అమిత్‌ షా మాట్లాడుతూ.. చాలా మంది కాంగ్రెస్ నేతలకు బీజేపీ భారతరత్న ఇచ్చిందన్నారు.

తాతకు, నాన్నకు, అమ్మకు మాత్రమే భారతరత్న ఇచ్చే పార్టీ తమది కాదనన్నారు. బీజేపీ పార్టీ దేశానికి ఎవరు సహకరించినా గౌరవిస్తామని అమిత్‌ షా పునరుద్ఘాటించారు. ఇక పద్మ అవార్డులు, ప్రతిష్టాత్మక అవార్డుల కేటాయింపుల విషయాన్ని రాజకీయం చేయొద్దని అమిత్‌ షా అన్నారు. బీజేపీ, ఎన్‌డీఏ పద్మ అవార్డలను అర్హులకు మాత్రమే అందించిందని తెలిపారు. చేశారు. గతంలో కొంతమంది జర్నలిస్టుల సిఫార్సుతో అవార్డులు ఇచ్చేవారు, నేడు అలా జరగడం లేదని అమిత్‌ షా చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..