Hindi in Medicine: దేశంలో హిందీలో తొలిసారి మెడిసిన్‌ కోర్సు.. మధ్యప్రదేశ్‌లో ప్రారంభించిన అమిత్‌షా..

|

Oct 16, 2022 | 2:29 PM

దేశంలో తొలిసారిగా మధ్యప్రదేశ్‌లో మెడిసిన్‌ హిందీ మీడియం పుస్తకాలను ఆవిష్కరించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. మెడిసిన్‌ మొదటి సంవత్సరానికి చెందిన మూడు హిందీ మీడియం పుస్తకాలను..

Hindi in Medicine: దేశంలో హిందీలో తొలిసారి మెడిసిన్‌ కోర్సు.. మధ్యప్రదేశ్‌లో ప్రారంభించిన అమిత్‌షా..
Home Minister Amit Shah
Follow us on

దేశంలో తొలిసారిగా మధ్యప్రదేశ్‌లో మెడిసిన్‌ హిందీ మీడియం పుస్తకాలను ఆవిష్కరించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. మెడిసిన్‌ మొదటి సంవత్సరానికి చెందిన మూడు హిందీ మీడియం పుస్తకాలను అమిత్ షా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. హిందీభాషకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవాలన్న ప్రధాని మోదీ సంకల్పానికి ఇది నిదర్శనమని అన్నారు. మెడిసిన్‌తో పాటు అతిత్వరలో 8 భాషల్లో దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కోర్సులను ప్రవేశపెడుతామని తెలిపారాయన. దీంతో మెథోవలస తగ్గుతుందన్నారు. మాతృభాషలో చదువుకున్న విద్యార్ధులకు అన్యాయం జరగకూడదన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమిత్‌షా తెలిపారు. ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌ కోర్సులను కూడా 8 భాషల్లో ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు. భారత విద్యారంగంలో ఇది సువర్ణ అధ్యాయమని అన్నారు అమిత్‌ షా. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన కొత్త విద్యావిధానంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్ధులకు చాలా మేలు జరుగుతుందని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..