Joe Biden: అమెరికా అధ్యక్షుడి సెక్యూరిటీ చూస్తే మతిపోవాల్సిందే.. ఎన్నో ప్రోటోకాల్స్‌

అమెరికా అధ్యక్షుడి భద్రతకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. జోబిడైన్‌ భద్రత కోసం అనేక రకాల ప్రోటోకాల్స్‌ను అధికారులు తూచా తప్పకుండా పాటించారు. ఇక అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా అతడు బస చేసే హోటల్‌ నుంచి అత్యాధునిక వసతులతో కూడిన ఆసుపత్రి కేవలం 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో చేరుకునేలా ఉండాలి. సమీపంలోని అన్ని ఆసుపత్రుల జాబితా భద్రతా సిబ్బంది దగ్గర ఉంటుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే అధ్యక్షుడిని నిమిషాల వ్యవధిలోనే...

Joe Biden: అమెరికా అధ్యక్షుడి సెక్యూరిటీ చూస్తే మతిపోవాల్సిందే.. ఎన్నో ప్రోటోకాల్స్‌
Joe Biden Security Protocol

Updated on: Sep 08, 2023 | 8:09 PM

ప్రపంచానికి పెద్దన్న అమెరికా.. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను అమెరికాపై ఆధారపడి ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఇంతటి కీర్తి ఉన్న ఈ దేశ అధ్యక్షుడి భద్రత విషయంలో ఎంతటి జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమెరికా అధ్యక్షుడు కేవలం అమెరికాలో మాత్రమే కాదు ఇతర దేశాల్లో ఉన్నా భద్రత చాలా కఠినంగా ఉంటుంది. తాజాగా జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు గాను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం బిడెన్‌కు సాదరస్వాగతం పలికింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడి భద్రతకు సంబంధించిన అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

అమెరికా అధ్యక్షుడి భద్రతకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. జోబిడైన్‌ భద్రత కోసం అనేక రకాల ప్రోటోకాల్స్‌ను అధికారులు తూచా తప్పకుండా పాటించారు. ఇక అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా అతడు బస చేసే హోటల్‌ నుంచి అత్యాధునిక వసతులతో కూడిన ఆసుపత్రి కేవలం 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో చేరుకునేలా ఉండాలి. సమీపంలోని అన్ని ఆసుపత్రుల జాబితా భద్రతా సిబ్బంది దగ్గర ఉంటుంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే అధ్యక్షుడిని నిమిషాల వ్యవధిలోనే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఈ చర్యలు తీసుకుంటారు. అలాగే ఆసుపత్రుల్లోని ట్రామా సెంటర్లు ఎప్పుడు అలర్ట్‌గా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఢిల్లీ చేరుకున్న జో బిడెన్ ఢిల్లీలోని ధౌలా కువాన్ సమీపంలో ఉన్న హోటల్ ఐటీసీ మౌర్యలో బస చేస్తారు. ఈ హాస్పిటల్‌కు చేరువలో చాలా పెద్ద చాలా పెద్ద ఆసుపత్రులు తక్కువ దూరంలో ఉన్నాయి. ఈ ఆసుపత్రుల వెలుపల ఒక ఏజెంట్‌ను కూడా ఉంచుతారు, అవసరమైతే వైద్యులతో ముందుగానే మాట్లాడి భద్రతా ఏర్పాట్లను చూసుకుంటారు. అత్యవసర పరిస్థితి కోసం అధ్యక్షుడి కారులో ఎల్లప్పుడూ ఒక రక్తం ప్యాకెట్ ఉంటుంది. ఆసుపత్రికి చేరేలోపు రక్తం అవసరమైతే అందించేందుకు అధ్యక్షుడి బ్లెడ్‌ గ్రూప్‌ రక్తాన్ని సిద్ధంగా ఉంచుతారు. ఇక అమెరికా అధ్యక్షుడి భద్రత ప్రోటోకాల్‌లో మరో కీలక అంశం బహిరంగ ప్రదేశంలో అధ్యక్షుడు ఎట్టి పరిస్థితుల్లో 45 నిమిషాలు మించి ఉండకూడదు.

బైడెన్‌కి స్వాగతం పలికిన కేంద్ర మంత్రి వీకే సింగ్..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..