బాబ్రీ మజీద్ విధ్వంసం కేసులో లాల్ కృష్ణ అద్వానీతో పాటు మరికొందరికి మరోసారి ఊరట లభించింది. వీరంతా నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన అప్పీల్‌ను అలహాబాద్ హైకోర్టు బుధవారం కొట్టేసింది. 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మజీద్ విధ్వంసంలో మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతితో పాటు మరికొందరు నాయకులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అందరూ నిర్దోషులేనని లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును వెలవరించిన విషయం విధితమే.
తాజాగా ఈ తీర్పుకు సవాలు చేస్తూ అయోధ్యకు చెందిన ఇద్దరు ముస్లింలు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ రమేష్ సిన్హా, జస్టిస్ సరోజ్ యాదవ్‌లతో కూడిన ధర్మానం ఈ అప్పీల్‌ను తోసిపుచ్చింది. ఇరు వర్గాల వాదనలు ముగిసిన తర్వాత కోర్టు తీర్పును అక్టోబర్ 31వ తేదీకి రిజర్వ్ చేసింది.
అయోధ్యలో నివసిస్తున్న హాజీ మహబూబ్ అహ్మద్, సయ్యద్ అఖ్లాక్ అహ్మద్ కోర్టుకు విన్నవించిన అప్పీల్‌లో బాబ్రీ కేసులో నిందింతులను నిర్ధోషులుగా ప్రకటించిన సీబీఐ ప్రత్యేక కోర్టు 2020 నాటి తీర్పులు సవాలు చేశారు. ఆ సమయంలో జరిగిన కాల్పులు, దోపిడీల వల్ల ఇళ్లు ధ్వంసమై ఆర్థికంగా నష్టపోయామని ఆరోపించారు. వీరికి మద్దతుగా న్యాయవాదులు ఫర్మాన్ అలీ నఖ్వీ, నజం జాఫర్ నిలవగా.. సీబీఐ తరపుణు శివ్ పి శుక్లా వాదనలు వినిపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..