Salman Chishti Arrested: నుపుర్‌శర్మ తలను తెస్తే తన ఇంటిని ఇస్తానంటూ ప్రకటన చేసిన వ్యక్తి అరెస్ట్.. నిందితుడిపై ఇప్పటికే 13 కేసులు..

Salman Chishti arrested: అజ్మీర్‌ దర్గా ఖాదీ చిస్తీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నుపుర్‌ శర్మ తలపై వెల ప్రకటిస్తూ వీడియో విడుదల చేశాడు సల్మాన్‌. అయితే సల్మాన్‌ చిస్తీ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని అజ్మీర్‌ దర్గా పెద్దలు ప్రకటించారు.

Salman Chishti Arrested: నుపుర్‌శర్మ తలను తెస్తే తన ఇంటిని ఇస్తానంటూ ప్రకటన చేసిన వ్యక్తి అరెస్ట్.. నిందితుడిపై ఇప్పటికే 13 కేసులు..
Salman Chishti Arrested

Updated on: Jul 06, 2022 | 2:18 PM

నుపుర్‌శర్మ తలను తెస్తే తన ఇంటిని ఇస్తానన్న అజ్మీర్‌ దర్గా ఖాదీ చిస్తీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నుపుర్‌ శర్మ తలపై వెల ప్రకటిస్తూ వీడియో విడుదల చేశాడు సల్మాన్‌. అయితే సల్మాన్‌ చిస్తీ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని అజ్మీర్‌ దర్గా పెద్దలు ప్రకటించారు. సోషల్‌ మీడియాలో సల్మాన్‌ చిస్తీ వీడియో వైరల్‌ అయ్యింది. దీంతో అజ్మీర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు కావడంతో సల్మాన్‌ చిస్తీ పరారయ్యాడు. సల్మాన్‌ చిస్తీని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చివరకు పోలీసులకు చిక్కాడు చిస్తీ. ఖాదిం సల్మాన్‌ చిస్తీపై గతంలో కూడా కేసులు ఉన్నాయి. రౌడీషీట్‌తో పాటు 13 కేసులు ఉన్నాయి. హత్యతో పాటు హత్యాయత్నం కేసుల్లో నిందితుడిగా ఉన్న సల్మాన్‌ ఇప్పుడు నుపుర్‌ను బెదిరించడం సంచలనం రేపుతోంది.

నూపుర్ శర్మను హత్య చేసిన వ్యక్తికి తన ఇంటిని ఇస్తానంటూ నిందితుడు సల్మాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించి, అజ్మీర్ దర్గా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో మూడు బృందాలుగా ఏర్పడి నిందితుడు సల్మాన్ చిస్తీ ఇంటితో పాటు వివిధ ప్రదేశాలలో దాడులు నిర్వహించింది.

ఇవి కూడా చదవండి

సోమవారం మీడియా, పోలీసుల ముందుకు వచ్చిన ఈ వీడియో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో పోలీసులు కూడా నిందితుడిని పట్టుకునేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ తర్వాత నిందితుడు సల్మాన్ చిస్తీని ఖాదీం మొహల్లాలోని అతని ఇంటి నుంచి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అజ్మీర్‌ అదనపు పోలీసు సూపరింటెండెంట్‌ వికాస్‌ సంగ్వాన్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ సందీప్‌ సరస్వత్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ దల్బీర్‌ సింగ్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు, ప్రత్యేక బృందం సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ వార్తల కోసం