తమ సిబ్బంది అందరికీ ప్రాధాన్యతా ప్రాతిపదికపై వ్యాక్సిన్ ఇచ్చేందుకు క్యాంపులు నిర్వహించకపొతే తాము విమానాలను నడపబోమని ఎయిరిండియా పైలట్ల సంఘం (ఐసీపీఏ) హెచ్చరించింది. పాన్ ఇండియా బేసిస్ పై వ్యాక్సినేషన్ క్యాంపులను తక్షణమే ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో తాము పనులను నిలిపివేస్తామని పేర్కొంది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురికి లేఖ రాసింది. ఈ కోవిద్ పాండమిక్ తరుణంలో తమ సేవలను గుర్తించాలని ఈ సంస్థ కోరింది. అలాగే కోవిడ్ 19 కి ముందు తమ నెలవారీ వేతనాలు ఎలా ఉన్నాయో ఆ విధంగా వాటిని పునరుద్ధరించాలని కోరారు. మా వేతనాల్లో దారుణంగా కోత విధిస్తున్నారు.. చాలాకాలంగా ఈ కోత సాగుతోంది.. మా పట్ల ఎయిరిండియా యాజమాన్యం దయనీయంగా ప్రవర్తిస్తోంది అని పైలట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మీ కార్యాలయమైనా మా సమస్యలపట్ల సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. కరోనా పాండమిక్ కారణంగా లిక్విడిటీ సంక్షోభం ఏర్పడడంతో గత ఏప్రిల్ లో ఎయిరిండియా తమ పైలట్ల వేతనాల్లో 55 శాతం కోత విధించింది. అయితే గత డిసెంబరులో టోటల్ డిడక్షన్ నుంచి 5 శాతం వేతనాన్ని పునరుద్ధరించింది. కానీ కరోనా పాండమిక్ ముందున్న వేతనాలతో పోలిస్తే అంతకన్నా తక్కువగానే శాలరీ ఉంటోందని వీరు వాపోతున్నారు. 50 శాతం కోత విధించారన్నారు.
వందే భారత్ పథకం కింద తమ సిబ్బంది అతి సుదీర్ఘమైన క్లిష్టతర సవాళ్ళను ఎదుర్కొంటున్నారని, కానీ వేతనాల్లో కోత ఇంకా కొనసాగుతోందని పైలట్లు వాపోయారు. ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ కూడా వచ్చిందని, భారతీయులపై ప్రపంచ వ్యాప్తంగా ట్రావెల్ ఆంక్షలు పెరిగాయని వీరు తెలిపారు. తమను కూడా ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించాలని పైలట్లు కోరుతున్నారు. అసలు మా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎందుకు జాప్యం జరుగుతోందని వీరు ప్రశ్నించారు. అనేకమంది ప్రయాణికులు విమానాల్లో ఎక్కుతుంటారని, ఈ కోవిడ్ తరుణంలో తమ సమస్యలను గుర్తించాలని ఎయిరిండియా పైలట్ల సంఘం విజ్ఞప్తి చేసింది.
మరిన్ని చదవండి ఇక్కడ : సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్న గున్న ఏనుగు..వావ్ అంటున్న నెటిజెన్లు..: Elephant Viral Video.
ఓటీటీలో దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ వీడియో వకీల్ సాబ్ … :Vakeel Saab creates record OTT video.