Jammu Kashmir: విమానం ఆకారంలో బెలూన్.. భారత్-పాక్ సరిహద్దులో కలకలం.. తీరా చూస్తే..

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ‘పీఐఏ’ పేరుతో ఉన్న బెలూన్ విమానం తీవ్ర కలకలం రేపింది.

Jammu Kashmir: విమానం ఆకారంలో బెలూన్.. భారత్-పాక్ సరిహద్దులో కలకలం.. తీరా చూస్తే..
Pia Balloon Aircraft

Updated on: Mar 30, 2021 | 7:22 AM

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ‘పీఐఏ’ పేరుతో ఉన్న బెలూన్ విమానం తీవ్ర కలకలం రేపింది. జమ్మూలోని కనాచక్ ప్రాంతంలో పంట పొలాల్లో ‘పీఐఏ’(పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్) పేరుతో ఉన్న బెలూన్ విమానం పడింది. దానిని గమనించిన స్థానికులు.. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బాంబ్ లాంటివి ఏమైనా ఉన్నాయేమో అని ఆందోళనకు గురయ్యారు. ఆ బెలూన్ విమానానికి దూరంగా వెళ్లిన ప్రజలు.. దానికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బెలూన్ విమానాన్ని పరిశీలించారు. బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. చివరికి ఏమీ లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు ఆ బెలూన్ విమానాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇలాంటి బెలూన్ విమానం దొరకడం ఇది మూడవ సారి అని అక్కడి అధికారులు చెబుతున్నారు. మార్చి 10, 16వ తేదీల్లో హిరానగర్ సెక్టార్‌లోని సోత్రా చక్ గ్రామంతో పాటు.. జమ్మూలోని భల్వాల్ ప్రాంతంలో ఇలాంటి బెలూన్లనే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also read:

TTD Plans: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమ‌ల‌లో ట్రాఫిక్‌ ప్రాబ్లమ్స్‌కి చెక్.. మ‌ల్టీలెవ‌ల్ కార్ పా‌ర్కింగ్‌ల ఏర్పాటు.. కొండపై ఎక్కడో తెలుసా..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారి ఉద్యోగ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.. అందుకు ఏం చేయాలంటే..

Indonesia Fire Accident: ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురుకి గాయాలు.. వెయ్యిమందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు