LS polls 2024: ప్రధాని అభ్యర్థిగా ఏ ఒక్కరిని నిలిపినా మోదీకే లాభం.. రానున్న లోక్‌సభ ఎన్నికలపై ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Jan 10, 2023 | 1:26 PM

వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష పార్టీలు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా పెడితే అది బీజేపీకి, ప్రధాని మోదీకి అనుకూలంగా..

LS polls 2024: ప్రధాని అభ్యర్థిగా ఏ ఒక్కరిని నిలిపినా మోదీకే లాభం.. రానున్న లోక్‌సభ ఎన్నికలపై ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు..
Owaisi On Pm Modi, Kejriwal And Rahul Gandhi
Follow us on

వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష పార్టీలు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా పెడితే అది బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా మారుతుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. సోమవారం జరిగిన ‘పాడ్‌కాస్ట్ విత్ స్మితా ప్రకాష్’ ఎపిసోడ్‌లో..ఓవైసీ మాట్లాడుతూ ‘బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని బలపరచాలని’ అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న 540 పార్లమెంటరీ నియోజక వర్గాలలో బీజేపీకి గట్టిపోటీని ఇవ్వాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి పక్షాలు వేరువేరుగా పోటీచేస్తే మోదీపై పైచేయి సాధించవచ్చని, లేకపోతే మోదీకే లాభం చేకూరుతుందని అన్నారు. ప్రతిపక్షాలు వేరువేరుగా మోదీపై పోటీ పడితే మోదీ వర్సెస్ అర్వింద్ కేజ్రీవాల్ లేదా రాహుల్ గాంధీ అయితే ప్రధానికే అవకాశం లభించినట్లవుతుందన్నారు. అంతేకాక రానున్న ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏ పాత్ర పోషిస్తారనేది తెలియదన్నారు.

‘‘2024లో బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పశ్చిమ బెంగాల్ సీఎం గతంలో పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా పార్లమెంటులో తీర్మానం కూడా చేస్తారు, కానీ తరువాత ప్రధాని మోడీని ప్రశంసించారు’’ అని అసదుద్దీన్ ఓవైసీ మమత విషయంలో వ్యాఖ్యానించారు. అయితే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. అయితే ప్రతిపక్షాల కోరిక నెరవేరకపోవడంతో అవి చీలిపోయాయి. ఈ క్రమంలోనే 2024 లోక్‌సభ ఎన్నికలపై ద‌ృష్టి కేంద్రీకరించడంతో.. కేంద్రంలో మోదీ వర్సెస్ అర్వీంద్ కేజ్రీవాల్ మధ్య పోరు ఉండబోతుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవలి కాలంలో తెలిపింది.

‘కేజ్రీవాల్‌కు పెరుగుతున్న ప్రజాదరణ, దేశ రాజధానిలో ఆయన పాలనా విధానం, దేశంలో ఎన్నికల పాదముద్రను విస్తరిస్తున్న ఆప్‌తో బీజేపీ, ప్రధాని మోదీ కదిలిపోయార’ని ఆప్ పేర్కొంది. కేంద్రంలోని బీజేపీకి ఎరగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు కూడా తన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మార్చారు. రానున్న ఎన్నికల్లో కాషాయ పార్టీకి గట్టి పోటీనిచ్చే ప్రయత్నంలో జాతీయ పార్టీగా గుర్తింపు పొందారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.