భారత్ బయో టెక్ కంపెనీ వారి కోవాగ్జిన్ వ్యాక్సిన్ ట్రయల్స్ ని 6- 12 ఏళ్ళ మధ్య వయస్సువారిపై =రేపటి నుంచి నిర్వహించనున్నారు. ఈ స్క్రీనింగ్ సన్నాహాలు పూర్తి అయినట్టు ఈ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే 12-18 ఏళ్ళ మధ్య వయస్కులపై క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయ్యాయని, వారికీ సింగిల్ డోసు వ్యాక్సిన్ ఇచ్చారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే సమయంలో 2-6 ఏళ్ళ మధ్య వయస్సు పిల్లలపై ట్రయల్స్ ను 525 సెంటర్లలో నిర్వహించనున్నారు. తొలుత వీటి నిర్వహణకు పాట్నాలోని ఎయిమ్స్, మైసూరు మెడికల్ కాలేజీ, కర్ణాటకలోని రీసెర్చ్ ఇన్స్ టిట్యూట్ లను ఎంపిక చేశారు. 2 నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్సు వారికి రెండు..మూడో దశల పరీక్షలకు ఇండియాలోని డ్రగ్ రెగ్యులేటరీ గత మే 12 న అనుమతినిచ్చింది.వివిధ వ్యయస్సులవారిపై ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నప్పుడు వైరస్ బిహేవియర్ మారుతోందా అన్న అంశాన్ని పరిశీలిస్తుండాలని ప్రభుత్వం నిపుణులకు సూచించింది. బాలల్లో కోవిద్-19 ఇన్ఫెక్షన్లను సమీక్షించేందుకు జాతీయ నిపుణుల బృందాన్నీ నియమించినట్టు నీతి ఆయోగ్ (హెల్త్) సభ్యుడు డాక్టర్ వీ.కె. పాల్ తెలిపారు.
వీరిపై థర్డ్ కోవిద్ వేవ్ చూపగల ప్రభావంపై కేంద్రం త్వరలో గైడ్ లైన్స్ జారీ చేస్తుందని ఆయన చెప్పారు. 12-18, 6-12, 2-6 ఏళ్ళ వారికి సంబంధించి ప్రతి గ్రూపునకు 175 మంది వలంటీర్ల చొప్పున క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే సూచనలు ఉన్నాయని అంటున్నారు. అయితే ప్రతి ట్రయల్ సందర్బంలోనూ బాలల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలు బాలలకు వాక్సిన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాయి. సింగపూర్ లో సుమారు 10 రోజుల క్రితమే వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టారు.
మరిన్ని ఇక్కడ చూడండి: పేదల కోసం ఇప్పటి వరుకు 14 లక్షల రూపాయాలు ఖర్చుపెట్టా..సోహెల్ ఎమోషనల్ వర్డ్స్: Syed Sohel video.
Kaushal Manda funny dance video:బేటీతో కౌశల్ మంద ఫన్నీ డ్యాన్స్. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..