రోజురోజుకీ ముదురుతున్న ఆ పైత్యం.. వారి కోసం దేశంలో తొలి మెడికల్ సెంటర్..!

దేశవ్యాప్తంగా ఉన్న చిన్నారులు, యువతను అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడేసేందుకు ఢిల్లీ ఎయిమ్స్ నడుం బిగించింది. ఇలా సెల్ ఫోన్, ఇంటర్నెట్ వ్యసనం బారిన పడుతున్న వారి కోసం ఏకంగా ఒక మెడికల్ సెంటర్ నే ప్రారంభించనుంది. ఇది తల్లిదండ్రులకు నిజంగా శుభవార్తే. ఇందులో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తారు.. పిల్లలను ఇందులో నుంచి బయటపడేసేందుకు ఎలాంటి చర్యాలు తీసుకుంటారు. అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి..

రోజురోజుకీ ముదురుతున్న ఆ పైత్యం.. వారి కోసం దేశంలో తొలి మెడికల్ సెంటర్..!
Teenage Internet Usage Delhi Aims

Edited By: Janardhan Veluru

Updated on: Feb 28, 2025 | 12:30 PM

పిల్లలు, యువతలో ఇంటర్నెట్ వినియోగం వ్యసనంగా మారుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ ఎయిమ్స్ ఈ సమస్యపై ఫోకస్ పెట్టింది ఎట్టకేలకు ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలో మొట్టమొదటి సారిగా ప్రత్యేక కేంద్రం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఏర్పాటు చేయనున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇటీవల సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ఆన్ అడిక్టివ్ బిహేవియర్స్ (కార్- ఏబీ) ఏర్పాటు ప్రతిపాదనను ఆమోదించింది. ఇవి అత్యంత ప్రమాదకర సమస్యగా పరిణమిస్తున్న ఇంటర్నెట్ వ్యసనాన్ని తగ్గించడంపై దృష్టి సారించనున్నాయి.

అతి పెద్ద సమస్యగా ఇంటర్నెట్..

ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని బిహేవియరల్ అడిక్షన్స్ క్లినిక్ (బాక్) ఫ్యాకల్టీ ఇన్‌ఛార్జ్ యతన్ పాల్ సింగ్ బల్హారా మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం యొక్క అధిక మరియు సమస్యాత్మక వినియోగం ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా గుర్తించామన్నారు. పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. పిల్లలు మరియు టీనేజీలో మానసిక ఆరోగ్య సమస్యల గురవడానికి ఇంటర్నెట్ వాడకం అతిపెద్ద కారణంగా తెలిపారు. పిల్లలను, టీనేజీలోకి అడుగుపెడుతున్న వారిని ఇంటర్నెట్‌కు దూరంగా ఉంచడానికి పాఠశాల, కుటుంబ స్థాయిలో జోక్యం చేసుకోవాల్సిన తక్షణ అవసరాన్ని భారత ఆర్థిక సర్వే (2024-25) హైలైట్ చేసిందని డాక్టర్ బల్హారా అన్నారు.

ఇదేం చేస్తుందంటే..

ఈ కేంద్రం వివిధ వ్యసన ప్రవర్తనలను సమగ్రంగా పరిష్కరిస్తుందని ఆయన అన్నారు. పిల్లలు మరియు యువతలో ఇంటర్నెట్ మరియు టెక్నాలజీ సంబంధిత వ్యసనాల నివారణ, స్క్రీనింగ్, ముందస్తుగా గుర్తించడం, వాటిని అడ్డుకోవడం ప్రధాన లక్ష్యంగా ఉంటాయన్నారు.

ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది..

విద్య ఆరోగ్య సంరక్షణ రంగాలలోని నిపుణులను ఈ సమస్యలను నివారించడానికి అవసరమైన నైపుణ్యాలతో సన్నద్ధం చేస్తున్నారు. అందుకోసం అవసరమైన శిక్షణా సామగ్రిని రూపొందించనున్నారు. డాక్టర్ బల్హారా ప్రకారం, అధిక ఇంటర్నెట్, సాంకేతిక వినియోగంతో ఒత్తిడి, నిరాశ, ఆందోళన వ్యసనాన్ని తగ్గించడంలో కూడా వీరు సహాయపడతారు.

రూ. 14 కోట్ల బడ్జెట్..

సమస్యాత్మక సాంకేతిక పరిజ్ఞానం వాడకం ప్రమాదంలో ఉన్న యువకులను గుర్తించడానికి ఏఐ-ఆధారిత ప్రిడిక్టివ్ మోడల్‌ను అభివృద్ధి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ ప్రాజెక్టుకు రూ. 14 కోట్ల బడ్జెట్ వెచ్చించనున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అధిక మరియు సమస్యాత్మక వినియోగానికి సంబంధించిన కార్-ఏబీ, ఇంటర్నెట్ మరియు సాంకేతికత సంబంధిత వ్యసనాలను పరిష్కరించే లక్ష్యంతో జాతీయ నెట్‌వర్క్‌ను రూపొందించడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), ఇతర వైద్య కళాశాలు, కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంటుందని ఆయన అన్నారు.