Agnipath Protests: త్రివిధ దళాల్లో సైనిక నియమాకాల కోసం అగ్నిపథ్ స్కీమ్ పేరుతో కేంద్రం కొత్త సర్వీసును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దరఖాస్తు చేసుకునేందుకు అర్హత వయసు 17.5 నుంచి 21 ఏళ్లుగా నిర్ణయించింది. అయితే కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి సైనిక నియమాకాలు చేపట్టకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కొంత సడలింపును ఇచ్చింది. 2022 నియమకాలకు సంబంధించి అర్హతను గరిష్టంగా 23 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల పరిమితితో మొదటిసారి కేంద్రం తీసుకువచ్కచిన ‘అగ్నిపథ్’ పథకం కింద తొలి బ్యాచ్ 45వేల మందిని నియమించుకున్నారు. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైల్వే స్టేషన్‌లలో రైళ్లకు నిప్పు పెడుతున్నారు. ఈ పథకంపై దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బీహార్‌లో ఆందోళనకారులు పలు రైళ్లకు నిప్పు పెట్టారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్,హర్యానా, మధ్యప్రదేశ్‌లలో ఆందోళన కారులు రెచ్చిపోతున్నారు. పాత పద్దతినే సైనిక నియమాకాలు చేపట్టాలని తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో రాళ్లదాడులు కొనసాగుతున్నాయి.
#WATCH| #Agnipath:After gatherings at Ballia RS& stadium, sr police officers&DM talked to &dispersed students. After which,some students attempted to break window pane&set fire to an empty isolated train. Attempts of dousing underway;patrolling at diff areas underway:SP RK Nayyar pic.twitter.com/37t62q8UfV
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 17, 2022
బల్లియాలో రైలుకు నిప్పు
ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా రైల్వే స్టేడియం వద్ద ఆందోళనకారులు పెద్ద ఎత్తున గుమిగూడారు. దీంతో పోలీసు అధికారులు ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. ఆందోళనకు దిగుతున్న విద్యార్థులు స్టేషన్‌లోని కిటికీ అద్దాలను పగులగొట్టి ఖాళీగా ఉన్న రైలుకు నిప్పుపెట్టేందుకు ప్రయత్నించారు. ఇందుకు నిరసనగా లఖిసరాయ్ జంక్షన్ వద్ద ఆందోళనకారులు రైలును తగులబెట్టారు.
సికింద్రాబాద్‌లో నిరసనలు
అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తం నెలకొంది. ఆర్మీ పరీక్ష కోసం వచ్చిన యువకుల ఆందోళనతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. రైల్వే ప్లాట్ ఫాంపైకి యువకులు ఒక్కసారిగా దూసుకెళ్లారు. రైలు పట్టాల మధ్యలో పార్సల్ సామాన్లు వేసి నిప్పు పెట్టారు. గతంలో ఉన్న పాత పద్దతులను కొనసాగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే రైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి