National: భానుడి భగభగలను మించి ‘దహీ’ మంటలు.. FSSAI నిర్ణయంతో వివాదం చల్లారినట్టేనా..?

పెరుగు ప్యాకెట్లపై హిందీలో 'దహీ' అని రాయడం తమిళనాడులో ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెరుగు ప్యాకెట్లపై దహీ ఉండొద్దని.. దీన్ని సహించేది లేదని తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇండియన్...

National: భానుడి భగభగలను మించి ‘దహీ’ మంటలు.. FSSAI నిర్ణయంతో వివాదం చల్లారినట్టేనా..?
Fssai
Follow us

|

Updated on: Mar 30, 2023 | 3:49 PM

పెరుగు ప్యాకెట్లపై హిందీలో ‘దహీ’ అని రాయడం తమిళనాడులో ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెరుగు ప్యాకెట్లపై దహీ ఉండొద్దని.. దీన్ని సహించేది లేదని తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI).. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దుతోందని, పెరుగుకు సమానమైన తమిళ పదాన్ని ఉపయోగించాలని సీఎం కోరారు. తమిళం, కన్నడ మాట్లాడే రాష్ట్రాల్లో కూడా పెరుగు ప్యాకెట్లపై దహీ అనే హిందీ పదాన్ని వాడుతున్నారని… ఇలాంటి చర్యలు దక్షిణాది నుంచి హిందీని శాశ్వతంగా బహిష్కరించేలా చేస్తాయని స్టాలిన్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ఈ వివాదంపై ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండరార్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఎట్టకేలకు స్పందించింది. దహీ వివాదం మరింత ముదరకముందే దిద్దుబాటు చర్యలకు దిగింది. పెరుగు ప్యాకెట్ల మీద హిందీలో దహీ అని పెట్టాలన్న నిబంధననను తొలగిస్తూ FSSAI నిర్ణయం తీసుకుంది. తమిళనాడు సీఎం స్టాలిన్ అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. చిన్న అక్షరాలతో ప్రాంతీ భాషల్లో పెట్టుకోవచ్చని నోట్‌ విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి

ఇందులో భాగంగానే అధికారికంగా ఓ ప్రెస్‌ నోట్‌ను విడుదల చేసింది. చిన్న అక్షరాలతో దహీ, మోసరు, జమూత్‌ దౌడ్‌, తయీర్‌, పెరుగు వంటి ప్రాంతీయ భాషల్లో పేర్లు పెట్టుకోవచ్చని ప్రకటనలో తెలిపింది. మరి ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండరార్ట్స్ అథారిటీ ఆఫ్‌ ఇండియా చేసిన ప్రకటనతో వివాదం ఇక్కడితో ముగిసిపోతుందో లేదో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..