Uttar Pradesh: అమ్మో..2017 నుంచి యూపీలో ఇన్ని ఎన్‌కౌంటర్లా..విచారణ జరపాలని సుప్రీంకోర్టులో పిటీషన్

|

Apr 17, 2023 | 11:16 AM

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్స్ అయిన అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ లను పోలీసుల ముందే దుండగులు కాల్చిచంపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Uttar Pradesh: అమ్మో..2017 నుంచి యూపీలో ఇన్ని ఎన్‌కౌంటర్లా..విచారణ జరపాలని సుప్రీంకోర్టులో పిటీషన్
Supreme Court Of India
Follow us on

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్స్ అయిన అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ లను పోలీసుల ముందే దుండగులు కాల్చిచంపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఓ అడ్వకేట్ దాఖలు చేసిన పిటీషన్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2017 నుంచి ఉత్తరప్రదేశ్ లో జరిగిన 183 ఎన్‌కౌంటర్లపై విచారణ జరిపించడానికి ఒక స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ విశాల్ తివారి అనే అడ్వకేట్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అతిక్ అహ్మద్, అతని సోదరుని హత్యపై కూడా విచారణ జరపాలని అభ్యర్థించారు.

యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత ఆరేళ్లలో 183 మంది క్రిమినల్స్ ను ఎన్‌కౌంటర్లో చంపినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. ఈ డేటాలో గురువారం చోటుచేసుకున్న అతిక్ అహ్మద్ కొడుకు అసద్, అలాగే అతని సహచరుడు గులామ్ ల ఎన్‌కౌంటర్లు కూడా ఉన్నాయి. దాదాపు 10,900 కు పైగా ఎన్‌కౌంటరు జరగగా.. 23,300 మంది నేరగాళ్లను అరెస్టు చేశామని 5,046 మందికి బుల్లెట్ గాయాలయ్యాయని పేర్కొన్నారు. అలాగే ఈ ఎన్‌కౌంటర్లో 1,443 పోలీసులకు గాయాలు కాగా..13 మంది చనిపోయినట్లు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి