నిండా ఆరేళ్లు కూడా లేని అనాథ చిన్నారులను చితక్కొట్టిన మహిళా ఉద్యోగి.. వీడియో వైరల్

|

Jun 05, 2023 | 6:59 PM

దైవం చిన్న చూపు చూడటం వల్ల లోకం తెలియని ఆ చిన్నారులు అనాథలయ్యారు. నిస్సహాయులైన అభం శుభం తెలియని ఆ చిన్నారులను అక్కున చేర్చుకోవడానికి బదులుగా.. జంతువులు కూడా సిగ్గు పడేలా ఓ అడాప్షన్ సెంట‌ర్‌కు చెందిన మహిళా స్టాఫ్‌ క్రూరంగా ప్రవర్తించింది. పసివాళ్లనే కనీసం కనికరం లేకుండా పిల్లలను దారుణంగా..

నిండా ఆరేళ్లు కూడా లేని అనాథ చిన్నారులను చితక్కొట్టిన మహిళా ఉద్యోగి.. వీడియో వైరల్
Woman Brutally Assaulting Girls
Follow us on

చత్తీస్‌ఘడ్‌: దైవం చిన్న చూపు చూడటం వల్ల లోకం తెలియని ఆ చిన్నారులు అనాథలయ్యారు. నిస్సహాయులైన అభం శుభం తెలియని ఆ చిన్నారులను అక్కున చేర్చుకోవడానికి బదులుగా.. జంతువులు కూడా సిగ్గు పడేలా ఓ అడాప్షన్ సెంట‌ర్‌కు చెందిన మహిళా స్టాఫ్‌ క్రూరంగా ప్రవర్తించింది. పసివాళ్లనే కనీసం కనికరం లేకుండా పిల్లలను దారుణంగా కొట్టింది. నిండా ఆరేళ్లు కూడా లేని పసి పిల్లలు ఏడుస్తూ.. వేడుకుంటున్నా విచక్షణా రహితంగా చావగొట్టింది. ఈ దారుణ ఘటన చత్తీస్‌ఘడ్‌లోని కాంకేర్ జిల్లాలోని అడాప్షన్ సెంట‌ర్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ప్రతి ఒక్కరూ సదరు మహిళ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు.

చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం కాంకేర్ జిల్లాలోని ఓ అడాప్షన్ సెంట‌ర్‌లో ఆరు ఏళ్ల కంటే తక్కువ వయసున్న అనాథలైన పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. అక్కడ సీమా ద్వివేది అనే మహిళ ప్రోగ్రాం మేనేజ‌ర్‌గా విధులు నిర్వహిస్తోంది. తాజాగా బయటికి వచ్చిన వీడియోలో.. నిండా ఆరేళ్లు కూడా లేని ఇద్దరు చిన్నారులను క్రూరంగా కొడుతూ హింసించింది. పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నా కనికరించకుండా పిల్లల జుట్టు ప‌ట్టుకుని చిత‌క్కొట్టడం కనిపిస్తుంది. అనంత‌రం వారిని నేలపై ఎత్తేకుదేస్తూ దారుణంగా కొట్టింది. ఆ తర్వాత మరొక చిన్నారిని గద్దించి పిలిచి ఏదో చెప్పింది. అనంతరం ఆ చిన్నారిని కూడా దుర్భాషలాడుతూ చావకొట్టింది. ఈ దారుణ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో కాంకేర్ క‌లెక్టర్‌ డాక్టర్ ప్రియాంక శుక్లా సీరియ‌స్‌ అయ్యారు. వెంటనే సదరు మహిళపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించారు. ఆ అడాప్షన్ సెంట‌ర్‌లోని ఇతర పిల్లల యోగక్షేమాలపై అనుమానం లేవనెత్తారు.

ఇవి కూడా చదవండి

కాగా ప్రోగ్రాం మేనేజ‌ర్‌ ద్వివేది ప్రవర్తనపై గ‌తంలో కూడా మ‌హిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ‌కు పలుమార్లు ఫిర్యాదులు అందాయి. ఐతే ఆమెపై ఎలాంటి చ‌ర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.