Stan Swamy: ఉపా చట్టం కింద అరెస్టయిన కార్యకర్త స్టాన్‌ స్వామి కన్ను మూత.. బెయిల్‌ పిటిషన్‌ విచారణ ప్రారంభం రోజే..

|

Jul 05, 2021 | 3:51 PM

Stan Swamy: ప్రముఖ హక్కుల కార్యకర్త భీమా-కోరేగావ్‌, ఎల్గార్‌ పరిషత్‌ కేసులో ఉపా చట్టం కింద అరెస్ట్‌ అయిన స్టాన్‌ స్వామి (84) సోమవారం తుదు శ్వాస విడిచారు. గతకొన్ని రోజులుగా కరోనాతో పాటు పార్కన్సన్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థకు గురైన ఆయన..

Stan Swamy: ఉపా చట్టం కింద అరెస్టయిన కార్యకర్త స్టాన్‌ స్వామి కన్ను మూత.. బెయిల్‌ పిటిషన్‌ విచారణ ప్రారంభం రోజే..
Stan Swamy
Follow us on

Stan Swamy: ప్రముఖ హక్కుల కార్యకర్త భీమా-కోరేగావ్‌, ఎల్గార్‌ పరిషత్‌ కేసులో ఉపా చట్టం కింద అరెస్ట్‌ అయిన స్టాన్‌ స్వామి (84) సోమవారం తుదు శ్వాస విడిచారు. గతకొన్ని రోజులుగా కరోనాతో పాటు పార్కన్సన్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థకు గురైన ఆయన శనివారం రాత్రి నుంచి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. కానీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో సోమవారం మధ్యాహ్నం కన్ను మూశారు. ఇదిలా ఉంటే స్వామి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని వెంటనే బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు సోమవారం ఉదయమే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ ఇంకా ప్రారంభంకాక ముందే స్వామి మరణించారు. మహారాష్ట్రలోని తలోజా జైల్లో ఉన్న స్టాన్‌ స్వామి అస్వస్థతకు గురి కావడంతో మే 28న కోర్టు ఆదేశాలతో హోలీ ఫ్యామిలీ ఆసుప్రతిలో చేర్పించారు. ఇదిలా ఉంటే అంతకు ముందు జైలు అధికారులు తనకు సరైన చికిత్సను అందించడం లేదంటూ స్వామి ఎన్‌హెచర్సీకి లేఖ రాశారు.

ఇంతకి ఎవరీ స్టాన్‌ స్వామి..

తమిళనాడు తిరుచిరాపల్లిలో జన్మించిన స్టాన్‌ స్వామి హక్కుల పోరాట కార్యకర్తగా దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. 2017 డిసెంబర్‌ 31న పుణేలో జరిగిన ఓ సమావేశంలో స్టాన్‌ స్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మరుసటి రోజు కొరెగావ్‌-భీమా యుద్ధ స్మారక చిహ్నం సమీపంలో జరిగిన రైతుల ధర్న హింసాత్మకంగా మారడానికి స్వామి చేసిన వ్యాఖ్యలే కారణమని పోలీసులు అభియోగించారు. ఇక స్టాన్‌ స్వామిని చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద అక్టోబర్‌ 8, 2020న నేషనల్ ఇన్వేస్టిగేషన్‌ ఏజెన్సీ అరెస్ట్ చేసింది. అనంతరం స్వామి యూఏపీఏ చట్టాన్ని సవాల్‌ చేస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఉపా చట్టం కింద అరెస్టయిన నిందితులకు బెయిల్ రాకుండా చేస్తున్న ఈ కీలక సెక్షన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. అధికారులు దర్యాప్తు సంస్ధల్ని వాడుకుంటూ బెయిల్‌ను అడ్డుకోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 21 కింద చట్టపరమైన సమానత్వం, జీవించే హక్కులను కాలరాస్తుందని స్టాన్ స్వామి కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ఈ పిటిషన్ ను బోంబే హైకోర్టు విచారణకు స్వీకరించింది.

Also Read: Corona Third Wave: సెప్టెంబర్ నాటికి పీక్ స్టేజ్‌లో థర్డ్‌ వేవ్.. ఎస్‌బీఐ షాకింగ్ రిపోర్ట్.. వివరాలు

Love Proposal: పిచ్‌లో గ‌ర్ల్‌ఫ్రెండ్‌కి లవ్ ప్రపోజ్‌.. హోరెత్తిన స్టేడియం.. వైరల్‌గా మారిన వీడియో..

Hero Vishal :హైదరాబాద్ లో వర్చువల్ ఆర్ట్ షో ‘ట్రాన్స్’ ను ప్రారంభించిన హీరో విశాల్..