Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ విజయాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ కార్యకర్తలు చేసుకుంటున్న సంబరాలలో అపశ్రుతి చోటుచేసుకుంది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ థానేలోని ఆ పార్టీ కార్యకర్తలు కొందరు పటాకులు పేల్చారు. అవి కాస్త యాక్టివా స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తి మీద పడడంతో అతను అదుపు తప్పి కింద పడిపోయాడు. అనంతరం ఆ యాక్టివా స్కూటర్‌లో మంటలు చెలరేగాయి.
అయితే ఆ స్కూటర్‌లో ఉన్నపాటుగా మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు. థానే నగర కాంగ్రెస్ కార్యాలయం సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఆ వ్యక్తికి గానీ ఇతరులకు గానీ ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 136 సీట్లను గెలుచుకుని అఖండ విజయం సాధించింది. అలాగే బీజేపీ 65, జేడీ(ఎస్) 19 స్థానాల్లో గెలిచింది. మరో 4 స్థానాలలో ఇతరులు గెలుపొందారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసిన 113 కంటే ఎక్కువ స్థానాలలో గెలిచిన కాంగ్రెస్‌కి అందుకు రంగం సిద్దం చేసింది. రేపు అంటే మే 15న కాంగ్రెస్ నుంచి కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక సీఎం రేసులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..