బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్(Aryan Khan) డ్రగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సాక్షి ప్రభాకర్ సెయిల్(Prabhakar sail) గుండెపోటుతో మృతి చెందినట్లు అతడి తరఫు న్యాయవాది తుషార్ ఖండారే వెల్లడించారు. ఇంట్లో ఉన్న సమయంలో ప్రభాకర్ కు గుండెపోటు(Heart attack) వచ్చిందని, ఆయన మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదని వివరించారు. గతేడాది అక్టోబర్ లో ముంబయి నగర శివారు తీరప్రాంతంలోని క్రూజ్ నౌకలో జరుగుతోన్న రేవ్ పార్టీపై ఎన్‌సీబీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్, మరికొంతమందిని అరెస్టు చేశారు. అతడితో పాటు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధమేచాలను కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఉన్న ఆర్యన్‌ను పోలీసులు స్థానిక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత జడ్జిముందు హాజరు పర్చారు. నిందితుల నుంచి వస్తున్న సమాచారంతో కొత్త కొత్త డ్రగ్స్ స్పాట్స్ వెలుగులోకి వస్తున్నాయి.
డ్రగ్స్ కేసులో సాక్షిగా ప్రభాకర్ సెయిల్ దర్యాపు సంస్థపై, అప్పటి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో గోసవి-ఎన్‌సీబీ మధ్య రహస్య ఒప్పందం, ముడుపుల వ్యవహారం నడుస్తోందని, వాంఖడే నుంచి తనకు ప్రాణాపాయం పొంచి ఉందని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని వెల్లడిస్తూ.. నార్కొటిక్ డ్రగ్స్ కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. ఇక ఈ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ మూడు వారాల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు.
మొన్నటి వరకు డ్రగ్స్ అంటే.. పంజాబ్, ఢిల్లీలకు మాత్రమే లింక్స్ ఉండేవి. అక్కడ డ్రగ్స్ తయారీపై నిఘా పెరగంతో అక్కడి తయారీ దారులు మకాం మార్చారు. తీగలాగితే డొంక కదిలినట్టు బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు హైదరాబాద్‌తో లింక్స్ దొరికాయి. హైదరాబాద్ టు ముంబైకి మత్తుపదార్థాలు సరఫరా అవుతోంది. హైదరాబాద్ పారిశ్రామిక వాడల్లోని కెమికల్ ఫ్యాక్టరీల్లో తయారైనట్టు గుర్తించారు. లోకల్ ఇండస్ట్రీస్‌లో తయారైన మత్తును ముంబైక్ షిఫ్ట్ చేసి అక్కడి నుంచి షిప్‌ల ద్వారా ఆస్ర్టేలియాకు ఎగుమతి చేస్తున్నట్ట NCB టీమ్స్ ఇన్వేస్టిగేషన్‌లో తేలింది.
Also Read
IPL 2022: రెండేళ్లలో కేవలం రెండు మ్యాచ్‌లు..మెగా వేలంలోనూ నిరాశే.. ఇప్పుడు మాత్రం రికార్డుల వేటలో..