Fire Accident: హంపిలో అగ్ని ప్రమాదం.. పలువురి గుడిసెలు, దుకాణాలు, హోటళ్లు దగ్ధం.. భారీగా ఆస్తినష్టం..

హంపిలోని జనతా ప్లాట్‌లో తొలుత బట్టల దుకాణంలో మంటలు చెలరేగినట్టుగా తెలిసింది. పక్కనే ఉన్న దుకాణాలు, హోటల్, లాడ్జిలో మంటలు చెలరేగాయి.

Fire Accident: హంపిలో అగ్ని ప్రమాదం.. పలువురి గుడిసెలు, దుకాణాలు, హోటళ్లు దగ్ధం.. భారీగా ఆస్తినష్టం..
Fire Accident At Hampi

Updated on: Oct 28, 2022 | 4:32 PM

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హంపిలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో దుకాణాలు, టెంట్లు, పలు హోటళ్లు దగ్ధమయ్యాయి. వస్తు సామాగ్రి మొత్తం మంటల్లో కాలిబూడిదైంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ప్రమాదవశాత్తు చెలరేగిన మంటల్లో హంపిలోని జనతా ప్లాట్‌లోని ప్రముఖ మ్యాంగో ట్రీ హోటల్, అన్నపూర్ణేశ్వరి ఛత్రం, బట్టల దుకాణాలు దగ్ధమయ్యాయి. హంపిలోని జనతా ప్లాట్‌లో తొలుత బట్టల దుకాణంలో మంటలు చెలరేగినట్టుగా తెలిసింది. పక్కనే ఉన్న దుకాణాలు, హోటల్, లాడ్జిలో మంటలు చెలరేగాయి. ఈ సందర్భంగా హోటల్‌లోని సిలిండర్లు పేలటంతో మ్యాంగో ట్రీ హోటల్ మొత్తం దగ్ధమైనట్లు సమాచారం.

అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో అప్రమత్తంగా ఉండడంతో ప్రాణ నష్టం తప్పిందని తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి