Amanatullah Khan: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అరెస్ట్.. ఏసీబీ దాడుల్లో రూ.24 లక్షల నగదు, తుపాకులు స్వాధీనం..

ఢిల్లీ వక్ఫ్ బోర్డు అవినీతి కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ (AAP MLA Amanatullah Khan) ను ఢిల్లీ ఏసీబీ అరెస్ట్ చేసింది. శుక్రవారం ఎమ్మెల్యే అమానతుల్లా, అతని సన్నిహితుల ఇళ్లల్లో ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించింది.

Amanatullah Khan: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ అరెస్ట్.. ఏసీబీ దాడుల్లో రూ.24 లక్షల నగదు, తుపాకులు స్వాధీనం..
Amanatullah Khan

Updated on: Sep 16, 2022 | 9:24 PM

Delhi Waqf Board corruption case : ఢిల్లీ వక్ఫ్ బోర్డు అవినీతి కేసులో ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ (AAP MLA Amanatullah Khan) ను ఢిల్లీ ఏసీబీ అరెస్ట్ చేసింది. శుక్రవారం ఎమ్మెల్యే అమానతుల్లా, అతని సన్నిహితుల ఇళ్లల్లో ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల దాడులు నిర్వహించగా.. అతని సన్నిహితుడి వద్ద పిస్టల్స్, కాట్రిడ్జ్‌లు, నగదు స్వాధీనం చేసుకుంది. ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇద్దరు సహచరుల నుంచి మొత్తం రూ.24 లక్షల నగదు, 2 అక్రమ ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. నేరారోపణలు, ఆధారాలు లభించడంతో ఆప్ ఎమ్మెల్యేను అరెస్టు చేసినట్లు తెలిపారు.

రెండేళ్ల కిందట ఢిల్లీ వక్ఫ్ బోర్డులో జరిగిన అక్రమ నియామకాలపై ఢిల్లీ పోలీస్‌ విభాగానికి చెందిన అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌, ఆయన వ్యాపార భాగస్వామి అయిన హమీద్ అలీ ఖాన్ మసూద్ ఉస్మాన్ నివాసాల్లో ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. రెండేళ్ల నాటి అవినీతి కేసులో ఖాన్‌కు ఏసీబీ విచారణ నిమిత్తం గురువారం నోటీసులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

2020లో అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసులో ఓఖ్లా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే ఖాన్‌ను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు పిలిచారు. విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..