తలలు పగిలాయి.. చేతులు విరిగాయి.. ఒక్కరికి కాదు.. ఇద్దరికి కాదు.. కేరళ అసెంబ్లీ ముట్టడిలో హై టెన్షన్..

|

Feb 22, 2021 | 10:35 PM

కేరళలో బీజేపీ యువమోర్చ, ఏబీవీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఉద్యోగ నియమాకాల్లో అక్రమాలు జరిగాయంటూ చేపట్టిన ర్యాలీలో హింస చేలరేగింది. పోలీసులు, ఆందోళన కారులు ఒకరిపై ఒకరు రాళ్లు రువుకున్నారు.

తలలు పగిలాయి.. చేతులు విరిగాయి.. ఒక్కరికి కాదు.. ఇద్దరికి కాదు.. కేరళ అసెంబ్లీ ముట్టడిలో హై టెన్షన్..
ABVP and Yuva Morcha activists
Follow us on

Kerala Police Laati Charge: తలలు పగిలాయి. చేతులు విరిగాయి. ఒక్కరికి కాదు.. ఇద్దరికి కాదు పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇలా కేరళలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కోద్దీ.. రాజకీయాలు వెడెక్కుతున్నాయి. ప్రతిపక్ష, అధికార పక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలే కాదు.. ఆందోళనలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి.

బీజేపీ యువమోర్చా ఏబీవీపీ కార్యకర్తలు చేపట్టిన చలో సెక్రటేరియట్‌ కార్యక్రమంలో హింస చెలరేగింది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఫలితాలను నిరసిస్తూ త్రివేండ్రంలో సెక్రటేరియట్‌లో ముట్టడించేందుకు ప్రయత్నించారు ఆందోళనకారులు. పోలీసుల పైకి రాళ్లు , కర్రలు రువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. లాఠీఛార్జ్‌లో యువమోర్చా కార్యకర్తలు తలలు పగిలాయి.

అయినప్పటికి ముందుకు వెళ్లడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. బారికేడ్లను తొలగించడానికి దూసుకెళ్లారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో పాటు వాటర్‌ కెనాన్లను కూడా ప్రయోగించారు. పోలీసులకు, యువమోర్చా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. లాఠీఛార్జ్‌లో నలుగురు యువమోర్చా కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. రాష్ట్ర కార్యదర్శి విష్ణు కూడా ఈ గొడవలో గాయపడ్డారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని బీజేపీతో పాటు.. అన్ని ప్రతిపక్షాలు ఆరోపణలుగుప్పిస్తున్నాయి. అయినా ప్రభుత్వం స్పందించక పోవడంతో.. ఇలాంటి ఆందోళనకు పిలుపునిస్తున్నాయి పార్టీలు. అధికారంలో ఉన్న పార్టీలు.. తమ తమ పార్టీ కార్యకర్తలతో ప్రభుత్వ ఉద్యోగాలను నింపుతున్నారని ఆరోపిస్తున్నారు నేతలు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే ఈ విధంగా వ్యవహరిస్తుందని మండిపడుతున్నాయి.

ఇది కూడా చదవండి

పుదుచ్చేరి ఎటువైపు.. గవర్నర్‌ ముందున్న ఆప్షన్స్‌ ఏంటి..? రాష్ట్రపతి పాలన వైపేనా..!