AAP MP Raghav Chadha: రాజ్యసభలో తన సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎంపీ రాఘవ్‌ చద్దా

|

Oct 10, 2023 | 4:45 PM

రాజ్యసభ నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. గత ఆగస్టు 11న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు సంబంధించిన మోషన్‌లో తమను సంప్రదించకుండా ఐదుగురు ఎంపీల నకిలీ సంతకాల ఆరోపణలపై రాఘవ్ చద్దాను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. తన సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ ఎంపీ రాఘవ్‌ చద్దా తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి ప్రివిలేజెస్ కమిటీ నివేదిక..

AAP MP Raghav Chadha: రాజ్యసభలో తన సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎంపీ రాఘవ్‌ చద్దా
AAP MP Raghav Chadha
Follow us on

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 10: రాజ్యసభ నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. గత ఆగస్టు 11న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు సంబంధించిన మోషన్‌లో తమను సంప్రదించకుండా ఐదుగురు ఎంపీల నకిలీ సంతకాల ఆరోపణలపై రాఘవ్ చద్దాను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. తన సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ ఎంపీ రాఘవ్‌ చద్దా తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు రాఘవ్ చద్దా సస్పెన్షన్‌లోనే ఉండనున్నారు. గతంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను కూడా క్రమశిక్షణ రాహిత్యంతో సభలో రబస సృష్టించినందుకు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ సస్పెండ్ చేశారు. ఆ తర్వాత సంజయ్ సింగ్ సస్పెన్షన్ కాలాన్ని మరికొంత కాలంపాటు పొడిగించారు.

ఐదుగురు ఎంపీల సంతాకాలు ఫోర్జరీ

ఢిల్లీ సర్వీసెస్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపేందుకు ఐదుగురు ఎంపీలు తమ అనుమతి లేకుండా వారి సంతకాలను ఆగస్టు 7న మోషన్‌లో ఉంచారని చద్దాపై ఆరోపణలు వచ్చాయి. ఎంపీలు సస్మిత్ పాత్ర, ఎస్ ఫాంగ్నాన్ కొన్యాక్, ఎం తంబిదురై, నరహరి అమీన్, తమను అడగకుండానే తమ పేర్లను హౌస్ ప్యానెల్‌లో చేర్చారని ఆరోపించారు. బిల్లు ప్రతిపాదనలో తమ పేర్లను ప్రస్తావించడాన్ని ఎంపీలు వ్యతిరేకించారు. వారిలో బీజేడీ ఎంపీ ఒకరు, ఏఐఏడీఎంకే నుంచి మరో ఎంపీ కూడా ఉన్నారు. దీనిపై విచారణ జరిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను డిమాండ్ చేశారు. సభలో విచారణకు ఆదేశించడంతో పాటు, నివేదిక వచ్చే వరకు చద్దాను సస్పెండ్ చేశారు. దీనిని సవాల్‌ చేస్తూ చద్దా నేడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

అధికారిక నివాసం వివాదంపై చద్దా స్టేట్‌మెంట్

దీనిపై చద్దా స్పందిస్తూ.. తమను ప్రశ్నించిన వారి నోరు మూయించేందుకు బీజేపీ పన్నిన కుట్రగా ఆయన అభివర్ణించారు. హౌస్‌ వివాదంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివరణ ఇచ్చారు. ద్వేషంతోనే బీజేపీ తనను టార్గెట్‌ చేసిందన్నారు. బీజేపీ చర్యలను దేశవ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ సంఘటన ప్రజల హృదయాల్లో నాకు శాశ్వత స్థానం కల్పించినట్లైందని అన్నారు. రాజ్యసభ సెక్రటేరియట్ నుంచి అందరు ఎంపీల మాదిరిగానే నేను కూడా అధికారిక నివాసాన్ని పొందాను. మొదట నన్ను పార్లమెంటు నుంచి గెంటేశారు. ఆ తర్వాత నన్ను హౌస్‌ నుంచి గెంటేస్తారు. కానీ బీజేపీ నన్ను ప్రజల గుండెల్లోంచి గెంటేయగలదా? ఈ పోరాటం అధికారిక నివాసం కోసం కాదు. దేశాన్ని రక్షించడం కోసం. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి తలెత్తిన ముప్పు కోసం చివరి వరకు పోరాడతాను. ఈ పోరాటంలో నేను ఒక్కటి కాదు వంద ఇళ్లు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విషయం ఢిల్లీ హైకోర్టులో ఉంది కాబట్టి నేను దీనిపై ఎక్కువగా వ్యాఖ్యానించను. దీన్ని నేను రాజ్యసభ సెక్రటేరియట్ నుంచి లాక్కోలేదు. కానీ నా ప్రసంగాలకు భయపడి బీజేపీ ఇలాంటి పన్నాగాలు పన్నుతోందని ఆయన అన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ ఉద్ధేశ్య పూర్వకంగా చద్దాను ఇరికించే ప్రయత్నం చేస్తుందని ఆప్‌ ఆరోపించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.