అయ్యో సత్యేందర్ జైన్ ఇలా అయిపోయారేంటి.. దాదాపు 35 కిలోలు తగ్గిపోయిన మాజీ మంత్రి

మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై, ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను నగరంలోని సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తుండటంతోనే ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

అయ్యో సత్యేందర్ జైన్ ఇలా అయిపోయారేంటి.. దాదాపు 35 కిలోలు తగ్గిపోయిన మాజీ మంత్రి
Aap Leader Satyendar Jain

Updated on: May 23, 2023 | 4:25 AM

మనీలాండరింగ్‌ కేసులో అరెస్టై, ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను నగరంలోని సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తుండటంతోనే ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. జైలులో ఒంటరితనం వల్ల ఆందోళనకు గురవుతున్నానని ఇటీవల సత్యేందర్ జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆయన పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ ఊరట లభించలేదు. దీంతో తనకు బెయిల్ ఇప్పించాలని సుప్రీంకోర్టులో కూడా గతవారం పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపున పిటిషన్ వేసిన అడ్వకేట్ మాట్లాడుతూ.. జైల్లో ఉన్న సమయంలో సత్యేందర్ జైన్ 35 కిలోల బరువు తగ్గిపోయారని.. ప్రస్తుతం అస్థిపంజరం లాగా మారిపోయారని ధర్మాసనానికి తెలియజేశాడు.

అయితే ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం.. పిటిషన్‌ అత్యవసర విచారణ కోసం వెకేషన్‌ బెంచ్‌ను ఆశ్రయించేందుకు అవకాశం కల్పించింది. ఇదిలా ఉండగా మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యేందర్‌ జైన్‌ గతేడాది మే 30 నుంచి జ్యుడిషియల్‌ కస్టడీలోనే ఉన్నారు. ఈ క్రమంలో తొలుత దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను ట్రయల్‌ కోర్టు 2022, నవంబర్‌ 17న కొట్టివేసింది. అనంతరం తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఈఏడాది ఏప్రిల్‌లో దిల్లీ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా ఆయనకు బెయిల్ మంజూరు కాలేదు. చివరికి దీన్ని సవాలు చేస్తూ మే 15న సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఒంటరిగా ఉండటం వల్ల ఆందోళనకు గురవుతున్నానని.. తానుంటున్న గదిలో ఇద్దరు వ్యక్తుల్ని తోడుగా ఉంచాలని కోరుతూ జైలు సూపరింటెండెంట్‌కు ఆయన ఇటీవల విజ్ఞప్తి చేశారు. దీంతో జైన్ సెల్‌లోకి ఇద్దరు ఖైదీలను బదిలీ చేయడం ప్రస్తుతం వివాదంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం