Aravind Kejriwal: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన కేజ్రీవాల్.. ఇండియా కూటమిపై అనుమానాలు ?

ఇక ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రచార కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇండియా కూటమి ఏర్పాటుపై ప్రణాళికలు, వ్యూహాలు జరుగుతున్న నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలపై ఉన్న ఐక్యమత్యంపై ప్రశ్నలు రేకిత్తిస్తున్నాయి. ఇక ఛత్తీస్‌గఢ్‌లో ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన కేజ్రీవాల్.. ఢిల్లీలోని విద్యా వ్యవస్థ ఎలా ఉందో చూడండని అంటూ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

Aravind Kejriwal: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన కేజ్రీవాల్.. ఇండియా కూటమిపై అనుమానాలు ?
Aravind Kejriwal

Updated on: Aug 20, 2023 | 5:21 AM

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆఫ్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఆరోపించారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రచార కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇండియా కూటమి ఏర్పాటుపై ప్రణాళికలు, వ్యూహాలు జరుగుతున్న నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రతిపక్షాలపై ఉన్న ఐక్యమత్యంపై ప్రశ్నలు రేకిత్తిస్తున్నాయి. ఇక ఛత్తీస్‌గఢ్‌లో ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన కేజ్రీవాల్.. ఢిల్లీలోని విద్యా వ్యవస్థ ఎలా ఉందో చూడండని అంటూ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీ స్కూళ్లలో ఉన్నటువంటి వసతులు అలాగే ఛత్తీస్‌గఢ్ పాఠశాలల్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకోవాలని అన్నారు.

 

ఛత్తీస్‌గఢ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే.. ప్రతి ఇంటికి కూడా 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఇక ఛత్తీస్‌గఢ్ పాఠశాలల్లో పది తరగతులకు కలిపి కేవలం ఒక్క టీచరే ఉన్నారని ఆరోపించారు. ప్రస్తుతం స్కూళ్లలో వసతులు దయానీయ పరిస్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే విద్యావ్యవస్థను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీలోనే సామాన్యుడు అనే అర్థం ఉంటుందని.. సామాన్యుల కోసం పుట్టిన పార్టీ ఆప్ అని అన్నారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఖండించారు. అసలు కేజ్రీవాల్ దేశ రాజధానితో ఛత్తీస్‌గఢ్ ను ఎందుకు పోల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాల పనితీరు వల్ల ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూడాలంటూ సూచించారు. ఢిల్లీలో అంతా సరిగ్గా ఉంటే కేజ్రీవాల్ రాయ్‌పూర్‌కు రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..