Delhi: ఢిల్లీలో ఆందోళనకు దిగిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. నిరసన చేపట్టిన బీజేపీ..

ఆమ్‌ ఆద్మీ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో నిరసనకు దిగింది. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ మోసానికి పాల్పడిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపిస్తూ ఆప్‌ ఢిల్లీలో ఆందోళన చేపట్టింది. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఆప్‌ నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అటు బీజేపీ నేతలు కూడా ఆమ్‌ ఆద్మీకి పోటీగా నిరసన చేపట్టింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ విచారణకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖం చాటేశారని మండిపడింది.

Delhi: ఢిల్లీలో ఆందోళనకు దిగిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. నిరసన చేపట్టిన బీజేపీ..
Aap Protest In Delhi

Updated on: Feb 02, 2024 | 9:00 PM

ఆమ్‌ ఆద్మీ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో నిరసనకు దిగింది. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ మోసానికి పాల్పడిందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపిస్తూ ఆప్‌ ఢిల్లీలో ఆందోళన చేపట్టింది. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఆప్‌ నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అటు బీజేపీ నేతలు కూడా ఆమ్‌ ఆద్మీకి పోటీగా నిరసన చేపట్టింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ విచారణకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖం చాటేశారని మండిపడింది. అరవింద్‌ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

చండీగఢ్ మేయర్ ఎన్నికలు అప్రజాస్వామ్యయుతంగా జరిగాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. దేశంలో బీజేపీ పాపాలపుట్ట అంతకంతకూ పెరిగిపోతోందని విమర్శించారు ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఎన్నికల్లో ఓట్లు, ఈవీఎంల ట్యాంపరింగ్‌, మోసాలు చేసి గెలవడంలో బీజేపీని మించిన పార్టీ మరొకటి లేదని మండిపడ్డారు అరవింద్‌ కేజ్రీవాల్‌.

రెండు రోజుల క్రితం చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో ఆప్‌-కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇండియా కూటమి పార్టీల సహకారానికి కేంద్రబిందువుగా నిలిచిన చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి మనోజ్‌ సోన్‌కర్‌ విజయం సాధించారు. తీవ్ర ఉద్రిక్తత వాతావరణం మధ్య జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి 16 ఓట్లు, ఆప్‌, కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థికి 12 ఓట్లు వచ్చాయి. 8 ఓట్లు చెల్లవని రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. దీంతో కౌన్సిల్‌ హాల్‌లో గొడవకు దిగారు ఆప్-కాంగ్రెస్ సభ్యులు. ఈ ఎన్నికల్లో హైడ్రామా చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..