Aadhaar Link : భూ రికార్డులతో ఆధార్ అనుసంధానం.. పారదర్శకత కోసం మరో రెండిటితో లింక్..! ఏంటో తెలుసుకోండి..?

|

Jun 27, 2021 | 7:52 PM

Aadhaar Link : డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ ఆధునీకరణ కార్యక్రమం కింద ప్రభుత్వం 2023-24 నాటికి దేశంలోని

Aadhaar Link : భూ రికార్డులతో ఆధార్ అనుసంధానం.. పారదర్శకత కోసం మరో రెండిటితో లింక్..! ఏంటో తెలుసుకోండి..?
Aadhaar Link
Follow us on

Aadhaar Link : డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ ఆధునీకరణ కార్యక్రమం కింద ప్రభుత్వం 2023-24 నాటికి దేశంలోని భూ రికార్డులతో ‘ఆధార్’ను అనుసంధానిస్తుంది. నేషనల్ కామన్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎన్జిడిఆర్ఎస్) , యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యుఎల్పిన్) ను కూడా అమలు చేస్తుంది. భూ వనరుల శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ “డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ ఆధునీకరణ కార్యక్రమం (డిఎల్‌ఆర్‌ఎంపి) గొప్ప ప్రగతి సాధించింది. ప్రాథమిక అవసరాల లక్ష్యాలను సాధించింది. కానీ ఈ కార్యక్రమం 100 శాతం రాష్ట్రాల సమస్యలు తీర్చలేకపోయాయి. ”

డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ ఆధునీకరణ కార్యక్రమం (DILRMP) 21 ఆగస్టు 2008 న కేంద్ర కేబినెట్ ఆమోదం పొందింది. ఏప్రిల్ 1, 2016 న దీనిని కేంద్ర రంగ పథకంగా ఆమోదించారు. ఇందులో కేంద్రం నుంచి100 శాతం నిధులు సమకూర్చబడ్డాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని భూ రికార్డులను అనుసంధానించే అనువైన ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐలిమ్స్) ను ఏర్పాటు చేయడం దీని లక్ష్యం.

భూ వనరుల శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని 2021 మార్చిలో పూర్తి చేయాల్సి ఉందని అయితే ఇప్పుడు దీనిని 2023-24 సంవత్సరం వరకు పొడిగించామని అన్నారు. కొనసాగుతున్న పనులతో సహా కొత్త కార్యాచరణ ప్రణాళికను రాబోయే మూడేళ్లలో పూర్తి చేయవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆస్తి పత్రాల నమోదు కోసం ‘వన్ నేషన్, వన్ సాఫ్ట్‌వేర్’ పథకం కింద 10 రాష్ట్రాల్లో నేషనల్ కామన్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎన్‌జిడిఆర్‌ఎస్) అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇవి కాకుండా 2021-22 నాటికి యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యుఎల్‌పిన్) అమలు చేస్తామన్నారు.

అండమాన్, నికోబార్ దీవులు, దాద్రా నగర్, హవేలి, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరాం, పంజాబ్లలోని 10 రాష్ట్రాలు / యుటిలలో ఎన్జిడిఆర్ఎస్ వ్యవస్థ అమలు చేస్తున్నారు. ప్రత్యేకమైన ల్యాండ్ పార్శిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ద్వారా ఆధార్ నంబర్‌ను భూ రికార్డులతో అనుసంధానం చేస్తామని తెలిపారు. అలాగే భూమి రికార్డులను రెవెన్యూ కోర్టు నిర్వహణ వ్యవస్థతో అనుసంధానించే కార్యక్రమం ఉంటుందన్నారు. యూనిక్ ప్లాట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యుఎల్‌పిన్) వ్యవస్థ ప్రతి ప్లాట్‌కు 14 అక్షరాల అంకెల ప్రత్యేక గుర్తింపు (ఐడి) కలిగి ఉంటుందని గమనించవచ్చు. ఈ ప్రత్యేక ID అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే జియో-రిఫరెన్స్ రెగ్యులేటర్‌పై ఆధారపడి ఉంటుంది. భూ రికార్డులను తాజాగా ఉంచడం, అన్ని ఆస్తి లావాదేవీల మధ్య సంబంధాన్ని ఏర్పరచడం దీని లక్ష్యం.

Saaho director Sujeeth: మెగాస్టార్‌ను మిస్ చేస‌కున్న సుజిత్.. ధ‌నుష్‌తో దుమ్ము రేపుతాడా..?

Ethiopian Tribe : ఇక్కడ లావుగా ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ప్రతి అమ్మాయి కల..! అందుకోసం బరువు పెరిగే పోటీలు..

PV Narasimha Rao : శత జయంతి ఉత్సవాల శుభ సందర్భంగా పీవీకి మరో అరుదైన గౌరవం – తొమ్మిది గ్రంధాల ఆవిష్కరణ!.. రేపే..