National: బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా విషాదం.. విగత జీవులుగా యువ జంట.

|

Jun 13, 2023 | 9:28 AM

మృత్యువు ఎప్పుడు, ఎక్కడి నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఆయువు నిండితే తాడే పామై కాటేస్తుందని చెబుతుంటారు. తాజాగా కర్ణాటక జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఇది నిజమే అనిపించేలా ఉంది. స్నానం చేయడానికి బాత్‌రూమ్‌లోకి వెళ్లిన ఓ జంట విగత జీవులుగా మారారు. ఇంతకీ ఏమైందంటే..

National: బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా విషాదం.. విగత జీవులుగా యువ జంట.
National News
Follow us on

మృత్యువు ఎప్పుడు, ఎక్కడి నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఆయువు నిండితే తాడే పామై కాటేస్తుందని చెబుతుంటారు. తాజాగా కర్ణాటక జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఇది నిజమే అనిపించేలా ఉంది. స్నానం చేయడానికి బాత్‌రూమ్‌లోకి వెళ్లిన ఓ జంట విగత జీవులుగా మారారు. ఇంతకీ ఏమైందంటే.. చామరజగనర జిల్లా గుండ్లుపేటేకు చెందిన చంద్రశేఖర్‌ (30), బెళగావి జిల్లా గోకాక్‌కు చెందిన సుధా రాణి (22) బెంగళూరులోని గోల్ఫ్‌ హోటల్‌లో పనిచేస్తున్నారు. చిక్కజాల పరిధిలోని తరబనహళ్లిలో అద్దె ఇంట్లో ఉంటూ సహ జీవనం చేస్తున్నారు.

త్వరలోనే వివాహం చేసుకోవాలని ఈ జంట ఫిక్స్‌ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ నెల 10వ తేదీన డ్యూటీ ముగించుకొని సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. అనంతరం స్నానం చేయడానికి బాత్‌రూమ్‌లోకి వెళ్లిన ఈ జంట గ్యాస్‌ గీజర్‌ ఆన్‌ చేశారు. అయితే స్నానం చేస్తున్న సమయంలో గీజర్‌ నుంచి కార్బన్‌ మోనాక్సైడ్‌ విషవాయువు లీకైంది. దీంతో ఇద్దరూ స్పహతప్పి బాత్‌రూమ్‌లో పడిపోయారు.

ఆదివారం డ్యూటీకి రాకపోవడంతో స్నేహితులు ఫోన్‌ చేశారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇంటికి వచ్చి కాలింగ్‌ బెల్‌ నొక్కారు. ఎంతకీ స్పందించకపోవడంతో చిక్కజాల పోలీసులకు సమాచారమిచ్చారు. ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ఇద్దరూ బాత్‌రూమ్‌లో శవాలై ఉన్నారు. దీంతో పోలీసులు శవాలను స్థానికంగా ఉన్న అంబేడ్కర్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..