AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanskrit Video: క్యా బాత్ హై డ్రైవర్ జీ.. సంస్కృతాన్ని ఇరగదసేశావుగా.. నెట్టింట వీడియో వైరల్..

దేశంలోని అనేక భాషలకు సంస్కృతం మూలం. అందుకే అతి పురాతనమైన ఈ భాషను దేవభాషగా అభివర్ణిస్తుంటారు. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ భాష స్కోరు పెంచుకునేందుకు ఉపయోగపడే ఒక సబ్జెక్టుగా మిగిలిపోయింది...

Sanskrit Video: క్యా బాత్ హై డ్రైవర్ జీ.. సంస్కృతాన్ని ఇరగదసేశావుగా.. నెట్టింట వీడియో వైరల్..
Driver Speaks In Sanskrit
Ganesh Mudavath
|

Updated on: Nov 17, 2022 | 11:09 AM

Share

దేశంలోని అనేక భాషలకు సంస్కృతం మూలం. అందుకే అతి పురాతనమైన ఈ భాషను దేవభాషగా అభివర్ణిస్తుంటారు. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ భాష స్కోరు పెంచుకునేందుకు ఉపయోగపడే ఒక సబ్జెక్టుగా మిగిలిపోయింది. సంస్కృతంలో మాట్లాడేవారు ఒక్కశాతం కూడా లేరు. హిందూ మతానికి సంబంధించిన కార్యక్రమాల్లో హిందూ రుత్విక్కులు కొందరు సంస్కృతం వాడుతూ ఉంటారు. అయితే అక్కడక్కడా కొందరు భాషా ప్రియులు సంస్కృతంలో మాట్లాడుతూ ఉండటం సంతోషకరం. అందుకే ఇంకా సంస్కృతం సజీవంగా ఉంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఢిల్లీలో జరిగిన ఓ ఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ క్యాబ్ డ్రైవర్ ప్రయాణికుడితో అనర్గళంగా సంస్కృతంలో మాట్లాడాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. క్యాబ్‌లో కూర్చున్న ప్రయాణికుడు డ్రైవర్‌తో సరదాగా సంస్కృతంలో మాట్లాడాడు. అందుకు ఆ డ్రైవర్‌ కూడా సంస్కృతంలో బదులిచ్చాడు. అది విని ఆశ్చర్యపోయిన ఆ ప్రయాణికుడు రెట్టించిన ఉత్సాహంతో క్యాబ్‌ డ్రైవర్‌ గురించి ఆరా తీసాడు.

తన పేరు అశోక్ అని, తనది ఉత్తరప్రదేశ్‌లోని గోండా అని సంస్కృతంలోనే డ్రైవర్ బదులిచ్చాడు. అలాగే, అతడి కుటుంబ సభ్యుల వివరాలను కూడా చక్కని సంస్కృతంలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఇండియా గేట్ సమీపంలో ఈ వీడియోను రికార్డు చేసినట్టుగా తెలుస్తోంది. ‘అమేజింగ్’ క్యాప్షన్‌తో ఓ ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశాడు. ‘అద్భుతం.. ఈ కారు డ్రైవర్ నాతో ఈ ఉదయం సంస్కృతంలో మాట్లాడాడు’ దీనిని బట్టి ఆయన మాతృభాష సంస్కృతం అని అర్ధమైందని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను దాదాపు 3 లక్షల మంది చూశారు. అంతే కాకుండా వేలల్లో లైక్స్ చేస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వేలమంది ఈ వీడియోను రీ ట్వీట్‌ చేశారు. కొందరు ఈ వీడియోకు సంస్కృతంలోనే కామెంట్లు చేశారు. సంస్కృతాన్ని సజీవంగా ఉంచుకోవాలంటే ఆ భాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఓ యూజర్ కామెంట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..