Trending Video: చుట్టూ జనం.. చేతిలో బైక్.. స్టంట్ చేయబోయి ఊహించని సీన్ కు స్టన్నయ్యాడు..
స్టంట్స్ చేసేందుకు చాలా గట్స్ కావాలి. చేయాలనే ఇంట్రెస్ట్ తో పాటు ఎక్కువ సార్లు ట్రై చేయాలి. అలా చేసినప్పుడే స్టంట్స్ ను పర్ఫెక్ట్ గా చేయవచ్చు. ఇలాంటివి ఎక్కువగా టీవీ షోలు, సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి...

స్టంట్స్ చేసేందుకు చాలా గట్స్ కావాలి. చేయాలనే ఇంట్రెస్ట్ తో పాటు ఎక్కువ సార్లు ట్రై చేయాలి. అలా చేసినప్పుడే స్టంట్స్ ను పర్ఫెక్ట్ గా చేయవచ్చు. ఇలాంటివి ఎక్కువగా టీవీ షోలు, సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ట్యాలెంట్ కు కొదవలేదు. అందరిలో ఏదో ఒక రకమైన ట్యాలెంట్ ఉంటుంది. అవసరాన్ని బట్టి అది బయటకు వస్తుంది. అయితే.. ఎంత పర్ఫెక్ట్ గా చేసినా.. కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న తప్పిదాలు ప్రమాదాలకు గురి చేస్తుంటాయి. వాహనాలపై స్టంట్స్ చేసే వారు ఈ విషయంలో ప్రమాదాలు ఎదుర్కొంటుంటారు. వెహికిల్స్ ను కంట్రోల్ చేయలేక కింద పడిపోవడం, గాయపడడం వంటివి చాలా కామన్ గా అయిపోయాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి బైక్ నడుపుతూ స్టంట్స్ చేసేందుకు ట్రై చేస్తాడు. పేద్ద బావి పక్కన జనాలందరూ గుమిగూడి ఉన్న సయమంలో తన ప్రతిభను అందరికీ చూపించేందుకు బైక్ రైడర్ రెడీ అయ్యాడు. పోటీ ప్రారంభం కాగానే.. అతను చాలా స్పీడ్ తో బైక్ నడపడాన్ని చూడవచ్చు. కానీ.. బైక్ కంట్రోల్ తప్పింది. సరిగ్గా బైక్ అంచులపై డ్రైవ్ చేసేందుకు ట్రై చేస్తున్న సమయంలో బైక్ స్లిప్ అయ్యింది. దీంతో అతను నేరుగా బావిలో పడిపోయాడు. ఈ ఘటనలో అతనికి గాయాలైనట్లు తెలుస్తోంది.




View this post on Instagram
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో.. ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ అయింది. వీడియోకు తక్కువ సమయంలో మంచి రెస్పాన్స్ వస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు. ఇలాంటి డేంజర్ స్టంట్స్ చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..