మీ పిల్లలు యక్టివ్ గా ఉన్నారా? అలా అని ఎది పడితే అది తింటున్నారా? అయితే మీ పిల్లలు ప్రమాదం లో పడినట్టే. తాజా అధ్యయనం ప్రకారం చాప కింద నీరులా విస్తరిస్తున్న లివర్ సమస్యలు పిల్లలో ఎక్కువగా కనిపిస్తున్నాయి అని తాజా సర్వేలు చెబుతున్నాయి. లివర్ సమస్య తో బాధ పడుతున్నా ప్రపంచ దేశాల్లో ఇండియా రెండో స్థానంలో ఉంది. ఇది ఇలానే కొనసాగితే ఇక అంతే సంగతులు అంటున్నారు నిపుణులు. సరైన ఫుడ్ డైట్, శారీరక శ్రమ లేకపోతే భవిష్యత్ తరాల సంగతి ఇక అంతే అంటున్నారు.ఇంతకీ ఏంటి ఆ ప్రమాదం.? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే. మారుతున్న జీవన శైలి,ఆహారపు అలవాట్ల కారణంగా మనకు తెలియని అనేక జబ్బులు మనల్ని వెంటాడుతున్నాయి. ఇందులో లివర్ డిసీజ్ ఒకటి. హార్ట్ ఎటాక్ లాగా సడెన్ డెత్‌లు లేకపోయినా రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా లివర్ సంబంధిత జబ్బులు పెరిగి మానవ మనుగడకు ఇబ్బంది కలుగుతుంది అని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇది పెద్దవాళ్ళతో పాటు చిన్నారుల్లోను ఎక్కువ ఇంపాక్ట్ ఉంది అని నిపుణులు అంటున్నారు. ఫ్యాటీ లివర్ కేసుల్లో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతుందని…ముఖ్యంగా చిన్న పిల్లలు వీటి భారిన పడటంలో భారత్ మూడో స్థానంలో ఉందని సీరియస్ వార్నింగ్ చేస్తున్నారు వైద్య నిపుణులు. చిన్న పిల్లలో ప్రస్తుతం లివర్ సమస్యతో బాధపడుతున్న ప్రపంచ దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. ఇండియా రెండో స్థానంలో చైనా మూడో స్థానంలో ఉందని తాజా సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇది ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ పెను ముప్పుగా మారుతుందని.. అది రానున్న 10 ఏళ్లలో మరణాలకు దారితీసే అవకాశం ఉంది అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం లివర్ డిసీజ్ తో హాస్పిటల్ కి వచ్చే వారిలో 60 శాతం మంది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌తో ఇబ్బంది పడేవరేనని లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న 35 ఏళ్ళు పై బడిన వారు లివర్ చెకప్ చేసుకుంటే అర్థం అవుతుంది అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
లివర్ డిసీజ్ రానున్న రోజుల్లో పెను ప్రమాదంగా మారనుంది. అయితే కనీసం ఇప్పటి నుండి అయిన జాగ్రత్తలు పాటిస్తే ముప్పు నుండి బయట పడవచ్చు అనేది నిపుణుల సలహా. మంచి ఫుడ్ డైట్ తీసుకుంటూ,శరీరానికి కొంత వ్యాయామ శ్రమ కలిగిస్తే మంచిది అని వైద్యులు అంటున్నారు. ప్రస్తుత చిన్న పిల్లలు స్కూల్ లలో కనీసం ప్లె గ్రౌండ్ కానీ ,ఆడుకునే సమయం కానీ ఉండటం లేదనీ.. దీని వల్లే అనేక అనర్థాలకు దారి తీస్తుంది అని అంటున్నారు. మంచి డైట్, ఎక్సర్సైజ్,ఆల్కహాల్ కి దూరంగా ఉంటే భవిష్యత్ తరలని ముప్పు నుండి బయటపడే ఛాన్స్ ఉంటుంది అని నిపుణుల సూచనలు చేస్తున్నారు.