భారత్ నుంచి ప్రతి ఏడాది సంపన్నలు విదేశాలకు వలస వెళ్తున్నారు . 2023లోనే సుమారు 6500 మంది అత్యధిక ఆదాయం కలిగిన వ్యక్తులు దేశం విడిచి వెళ్లే అవకాశం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడులు, సంపన్నుల కదలికల తీరును విశ్లేషించే ‘హెన్లీ ప్రైవేట్ మైగ్రేషన్ నివేదిక-2023’ ఈ వివరాలను తెలియజేసింది. హెన్లీ అండ్ పార్ట్నర్స్ ప్రకారం.. 10 లక్షల డాలర్లు అంతకంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టే వారిని మిలియనీర్లు లేదా అత్యధిక సంపద కలిగిన వ్యక్తులుగా పరిగణిస్తారు. అయితే ధనవంతులను కోల్పోతున్న దేశాల జాబితాలో ఈ ఏడాది చైనా మొదటి స్థానంలో నిలిచింది. 2023లో చైనా నుంచి దాదాపు 13,500 మంది సంపన్నులు వలస వెళ్తారని అంచనా వేస్తున్నారు.
అయితే ఆ తర్వాత స్థానంలో భారత్ ఉన్నప్పటికీ.. గతేడాదితో పోలిస్తే మాత్రం ఈ సంఖ్య తక్కువే ఉంది. గతేడాదిలో భారత్ నుంచి 7500 సంపన్నులు వలస వెళ్లారని అంచనా. ఈ ఏడాది వెళ్లేవారిలో చాలామంది దుబాయ్, సింగపూర్ దేశాలకు వలస వెళ్తున్నట్లు తేలిసింది. ఇక యూకే నుంచి 3200 మంది, రష్యా నుంచి 3వేల మంది వలస వెళ్లిపోనున్నారాని అంచనా. మరో విషయం ఏంటంటే భారత్ నుంచి భారీ సంఖ్యలో వెళ్లిపోతున్నప్పటికీ అంతకుమించిన సంఖ్యలో మిలియనీర్లు తయారవుతున్నారని న్యూ వరల్డ్ వెల్త్‌కు చెందిన పరిశోధకుడు ఆండ్రూ ఆమోయిల్స్ తెలిపారు. అందుకే ఇలా భారత్ నుంచి వలసలు ఉంటున్నప్పటికీ ప్రమాదం లేదని చెప్పారు. విదేశీ పన్ను చెల్లింపులకు సంబంధించి భారత్‌లో కఠిన నిబంధనలు ఉండటం వంటి సమస్యలు విదేశాల్లో పెట్టుబడుల ఆసక్తికి కారణమవుతున్నాయని మార్కెట్ నిపుణురాలు సునితా సింగ్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.